Zodiac Signs : ఈ 5 రాశులవారు ఆలస్యంగా వివాహం చేసుకుంటారు..! అందులో మీరున్నారా తెలుసుకోండి..

Zodiac Signs : ఏ పని చేయాలన్నా కొంతమంది జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఎందుకంటే కొంతమంది రాశిచక్రాలను గట్టిగా నమ్ముతారు. విద్య, వివాహాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు.

Zodiac Signs : ఈ 5 రాశులవారు ఆలస్యంగా వివాహం చేసుకుంటారు..! అందులో మీరున్నారా తెలుసుకోండి..
Zodiac Signs

Updated on: Jul 21, 2021 | 9:03 PM

Zodiac Signs : ఏ పని చేయాలన్నా కొంతమంది జ్యోతిష్యులను సంప్రదిస్తారు. ఎందుకంటే కొంతమంది రాశిచక్రాలను గట్టిగా నమ్ముతారు. విద్య, వివాహాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటారు. జ్యోతిష్యులు కూడా కొన్ని విషయాలను ముందుగానే చెప్పడం వల్ల వీరి నమ్మకానికి బలం చేకూరినట్లవుతుంది. అయితే వారు చెప్పిన ప్రకారం.. కొన్ని రాశుల వారికి ఆలస్యంగా వివాహం జరగుతుంది అంటున్నారు. ఆ రాశి చక్రాల గురించి వివరించారు.

1. మేషం: ఈ రాశి వారు చాలా భావోద్వేగంతో కూడుకున్నవారు. సున్నిత మనస్కులు. వీరి జీవితం కుటుంబ బాధ్యతలలో చిక్కుకుంటే తమ గురించి తాము ఆలోచించలేరు. అటువంటి పరిస్థితిలో వివాహం వాయిదా వేస్తారు. ఈ కారణంగా వీరికి వివాహం త్వరగా జరగదు. ఈ వ్యక్తులు స్వతంత్ర జీవితాన్ని ఇష్టపడతారు. కొన్నిసార్లు ఈ స్వభావం వారి సంబంధాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

2. మిథునం : ఈ రాశివారు తమ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు తమ వృత్తిని కొనసాగించడంలో బిజీగా ఉంటారు. త్వరగా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించరు. తమ మనస్సుకు నచ్చిన వారు ఎదురైనప్పుడు వివాహం చేసుకుంటారు. వీరు తెలివైన ఉల్లాసభరితమైన వ్యక్తులను ఇష్టపడతారు.

3. వృశ్చికం : ఈ రాశివారు చాలా మర్మమైనవారు. వారు ఏమనుకుంటున్నారో సులభంగా వెల్లడించరు. కుటుంబ సభ్యుల మాటలు వారిపై ఎలాంటి ప్రభావం చూపవు. వారు ఏమి చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. తమంతట తాము వివాహం గురించి ఆలోచిస్తే తప్పా వివాహానికి అవును అని చెప్పరు. అందుకే ఈ రాశివారి వివాహం ఆలస్యమవుతుంది.

4. ధనుస్సు : ఈ రాశిచక్రం వారు బానిసత్వంతో ముడిపడి ఉండటానికి ఇష్టపడరు. అందుకే ఈ వ్యక్తులు వివాహం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. స్వభావం ప్రకారం ఈ వ్యక్తులు తెలివైనవారుగా భావిస్తారు. వారి భాగస్వామి పరిస్థితి ప్రకారం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు.

5. కుంభం : ఈ రాశిచక్రం ప్రజలు జీవితంలో చాలా కష్టపడుతారు. ఎవరినీ సులభంగా నమ్మలేరు. కొన్నిసార్లు ఈ కారణంగా వారి వివాహం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ వారికి నమ్మకం కలిగితే వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల వివాహం ఆలస్యమవుతుంది.

Infosys Story: రెండు కోట్ల ఆఫర్ తిరస్కరించిన ఇన్ఫోసిస్ ఇప్పుడు 6.60 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థ..ఆసక్తికర ప్రస్ధానం!

Gas Problems : గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఈ ఆహార పదార్థాలను తినడం మానుకోండి

RBI New Rules : బ్యాంకు ఖాతాదారులకు గమనిక..! డెబిట్, క్రెడిట్ కార్డులపై పెరగనున్న ఛార్జీలు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తెలుసుకోండి