పూర్వ వైభవం కోల్పోయి, ఆదరణకు నోచుకోక ఏళ్లుగా కళావిహీనంగా మిగిలిపోయిన పానగల్(Panagal) దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం(Telangana) పచ్చజెండా ఊపింది. ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయంతో పాటు పర్యాటక అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ఆర్కిటెక్ బృందం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పానగల్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పానగల్ రాజధానిగా చేసుకుని పాలించిన కుందూరు చోళరాజులు 12వ శాతాబ్దంలో పానగల్‌లో పచ్చల సోమేశ్వరాలయం, ఛాయాసోమేశ్వరాలయం, సోమేశ్వరస్వామి మందిరాలను త్రికూట ఆలయాలుగా నిర్మించారు. అయితే సమీపంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో సోమేశ్వరాలయం మునిగిపోయింది. అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఛాయా సోమేశ్వరాలయాన్ని భక్తులు అభివృద్ధి కమిటీ పేరుతో పనులు చేయిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా పురస్కారాల సందర్భంగా రోడ్డు వేయడంతో దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. గ్రామంలోనే ఉన్న పచ్చల సోమేశ్వరాలయం అమ్మవారి ఆలయం కూలిపోయింది. అభివృద్ధి చేయాలని పురావస్తు శాఖ ప్రయత్నించినా నిధుల కొరతతో పనులు ముందుకు సాగలేదు.
ఆలయాల పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్, సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రాలు అందజేశారు. ఈ మేరకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి కె.రమేశ్ ఈ నెల 12న ఆర్కిటెక్ బృందం ఏర్పాటు చేయాలని సంబందిత శాఖకు ఆదేశాలు జారీచేశారు. నిధులు కేటాయిస్తే పానగల్ ఆలయాలతో పాటు పురావస్తు శాఖవారి మ్యూజియం, ఉదయం సముద్రం చెరువు అభివృద్ది చెందుతాయి. పానగల్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అంగీకరించడం ఆనందంగా ఉందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు.
Also Read
Baby Oil for Hair: బేబీ ఆయిల్‌తో జుట్టు సమస్యలకు చెక్.. ఇలా చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు..
Maruthi: దర్శకుడు మారుతికి పితృవియోగం.. పలువురు సినీ ప్రముఖుల సంతాపం