Snake in Temple: ఆ శివాలయం మహత్యం ఇదే.. ప్రతి ఏడాది నాగుపాము ప్రత్యక్షం.. శివయ్యకు పూజలు

|

Mar 02, 2022 | 8:01 AM

Snake in Temple: మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని గొడిసేర్యాల్(Godiseryala) రాజరాజేశ్వర శివాలయం(rajarajeshwara swamy Temple)లో నాగుపాము దర్శనమయ్యింది..

Snake in Temple: ఆ శివాలయం మహత్యం ఇదే.. ప్రతి ఏడాది నాగుపాము ప్రత్యక్షం.. శివయ్యకు పూజలు
Snake In Temple
Follow us on

Snake in Temple: మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని గొడిసేర్యాల్(Godiseryala) రాజరాజేశ్వర శివాలయం(rajarajeshwara swamy Temple)లో నాగుపాము దర్శనమయ్యింది. నాగుపాము ప్రత్యక్షం అవడంతో భక్తులు ఆలయంలో క్యూలైన్ లో నిలుచుని నాగేంద్రుని దర్శనం చేసుకున్నారు అయితే గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో శివరాత్రికి నాగు పాము వస్తుండడం ఆనవాయితీగా వస్తుంది, మహా శివరాత్రి రోజు నాగుపాము దర్శనంతో భక్తులు మంత్రముగ్దులయ్యారు.

నిర్మల్ జిల్లా దస్తూరబాద్ మండలంలోని గొడిసేర్యాల్ శివాలయంలో మహాశివరాత్రి వేళ మహా అద్బుతం చోటు చేసుకుంది శివరాత్రి రోజు రాత్రి నాగుపాము దర్శనం ఇచ్చింది ఒక్కసారిగ నాగు పాము ప్రత్యేక్షం అవడంతో భక్తులు భారీగా క్యూ లైన్ల ద్వారా నాగుపామును దర్శించుకున్నారు మహా శివరాత్రి పర్వదినానన నాగుపాము దర్శనం ఇవ్వడంతో తమ జన్మ ధన్యమైందని పలువురు భక్తులు తెలిపారు కాగ ఆలయంలో శివరాత్రి సంధర్భంగ భక్తులు జాగరణ ఉండటంతో ఆలయ అర్చకులు లక్ష్మణ స్వామి అధ్వర్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శివనామస్మరణతో శివాలయం చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ వరకు మార్మోగింది.

Also Read:

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..