Vastu Tips: ఆది శంకరుడు, పరమేశ్వరుడిగా పిలుచుకునే శివుడిని చాలా మంది భక్తులు ఆరాధిస్తారు. ఆయన పూజలో తరంచిపోతారు. భారతదేశంలో శివుని చిత్రపటం, శివలింగం గానీ లేని హిందువుల ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతీ సోమవారం నాడు భక్తులు ఆలయాలకు వెళ్లడం, ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాసాలు పాటించడం వంటివి చేస్తుంటారు. కొంత మంది తమ ఇళ్లలోనే శివుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తుంటారు. శివుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఇంట్లోని చెడు బయటకు పోయి.. సానుకూల శక్తి ఏర్పడుతుందని నమ్ముతారు.
అయితే, కొందరు మాత్ర పరమేశ్వరుడిని ఆరాధిస్తున్నప్పటికీ.. పేదరికంలో మగ్గిపోతుంటారు. అలాంటి వాటికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు, వేదాంతులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో శివుడి ఉగ్ర రూపానికి సంబంధించిన ఫోటో గానీ, విగ్రహం కానీ ఉండకూడదంటున్నారు. నటరాజ స్వామి విగ్రహం, శివుడు ఆగ్రహంతో ఉన్న ప్రతిమలు.. ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తాయంటున్నారు. ఒకవేళ అలాంటి విగ్రహాలు, ఫోటోలు ఉన్నట్లయితే వెంటనే తీసివేయాలని సూచిస్తున్నారు.
ఎలాంటి ఫోటోలు ఉండాలి..
శాంత స్వభావంతో కూడిన శివుడి ఫోటో గానీ, విగ్రహం గానీ ఇంట్లో ఉండాలి. సతీసమేతంగా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉండటం చాలా ఉత్తమం అని సూచిస్తున్నారు. ఈ ఫోటో ఇంట్లో ఉండే.. ఆదిదంపతుల కరుణ, ఆశీర్వాదం లభిస్తాయని విశ్వాసం. కుటుంబంలో శాంతి నెలకొని.. లక్ష్మీ దేవి కొలువుదీరుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..