3 / 8
ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాలమైన వీధులు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల దీపాలు అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది.