
Navaratri Karpoora Deepam
హిందువులు దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్ధాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఒకొక్క రోజు ఒకొక్క అవతారాన్ని ప్రతిష్టించి పూజిస్తే అమ్మ అనుగ్రహం సొంతం అవుతుందని నమ్మకం. అమ్మ దయతో సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
దసరా నవరాత్రులకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే భక్తులు నవరాత్రి పనులు మొదలు పెట్టేశారు. ఈ నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు ప్రాముఖ్యత ఉంది. అందుకనే అమ్మవారి పూజించడం వల్ల భక్తులకు శక్తి లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అంతేకాదు శరత్కాలంలో వచ్చే ఈ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారించి, విజయాన్ని చేకూరుస్తాయని పురాణ కథనం. దేవి పూజ చేసే సమయంలో కర్పూర దీపం వెలిగించడం అత్యంత ఫలవంతం. ఈ రోజు కర్పూర దీపం పూజ ప్రాముఖ్యత? ఎలా వెలిగించాలో తెలుసుకుందాం..
నవరాత్రిలో కర్పూర దీపం పూజ ప్రాముఖ్యత
- అమ్మవారిని పూజించే ముందు దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. అయితే కర్పూర దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి.. సానుకూల శక్తి వ్యప్తిస్తుందని నమ్మకం.
- అమ్మవారి పూజా సమయంలో దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి లేదా నూనె ఉపయోగిస్తారు.
- అయితే నవ రాత్రుల్లో కర్పూర దీపం వెలిగించడం అత్యంత ఫలవంతం.
- ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుందని విశ్వాసం.
కర్పూరం దీపాన్ని ఎలా వెలిగించాలంటే..
- దేవీ నవరాతుల్లో దీపారాధన చేసే సమయంలో దీపపు కుందేలో ఒత్తితో పాటు కర్పూరం పెట్టి వెలిగిస్తే అదే కర్పూర దీపం. దీనిని వెలిగించడం వలన ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
- వాస్తవానికి కర్పూరాన్ని పూజ చివరిలో హారతిగా ఇస్తారు. అయితే ఇలా కర్పూర దీపం వెలిగిస్తే దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుందని.. తన భక్తులను ఆశీర్వదిస్తుందని విశ్వాసం.
- పూజ అనంతరం దీపారాధన సమయంలో ఒత్తితో పాటు కర్పూరం, లవంగాలు వేయడం వలన ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ ఇంట్లో వారికీ డబ్బు కొరత ఉండదు.
- ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగి.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
- నవరాత్రులలో ఉదయం, సాయంత్రం రోజూ కర్పూరం, లవంగాలు వేసి దీపం వెలిగించడం వలన ఇంట్లో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది.
- కర్పూర దీపం వెలిగించడం వల్ల ఇంటిలోని వాతావరణం మానసిక ప్రశాంతత ఇచ్చే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు