Telugu News Spiritual Monday Shiva Puja tips: why shami leaves offered on shivling know the mythological importance
Lord Shiva: శివుడికి జమ్మి ఆకులతో పూజ చేయడానికి కొన్ని నియమాలు.. ప్రాముఖ్యత మీ కోసం..
శివలింగాన్ని శమీ ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని విశ్వాసం. అయితే జమ్మి ఆకులతో శివుడికి పూజించే సమయంలో కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనుక ఈ రోజు శివలింగానికి శమీ ఆకులను సమర్పించే విధానం, ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.
లయకారుడు శివుడిని మహాదేవుడు అంటారు. జలాభిషేకం చేస్తే చాలు తనను పూజించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. అందుకనే శంకరుడిని సంతోషపెట్టడం కూడా చాలా సులభమని అంటారు. హిందూ మతంలో శివలింగ ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నీరు, బిల్వపత్రం, ఉమ్మెత్త, జమ్మి ఆకులు మొదలైనవి శివలింగ పూజకు ముఖ్యమైనవిగా భావిస్తారు. శివలింగాన్ని శమీ ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని విశ్వాసం. అయితే జమ్మి ఆకులతో శివుడికి పూజించే సమయంలో కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనుక ఈ రోజు శివలింగానికి శమీ ఆకులను సమర్పించే విధానం, ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.
శివలింగ పూజా విధానం:
తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ముందుగా శివాలయానికి వెళ్లి ఉత్తరం లేదా తూర్పు దిశలో శివలింగం దగ్గర కూర్చోవాలి.
దీని తరువాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటితో అభిషేకం చేయండి.
శివునికి ఇష్టమైన పూలు, బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జమ్మి ఆకులను శివలింగానికి సమర్పించండి . అంతేకాదు తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు, జంధ్యం, అక్షతలు, జనపనారను కూడా సమర్పించాలి.
శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించేటప్పుడు.. తాజాగా ఆకులను మాత్రమే ఉపయోగించాలి. అప్పటికప్పుడు కోసిన ఆకులతో మాత్రమే పూజకు ఉపయోగించాలి