
అయోధ్య నగరంలో సందర్శనా స్థలాల కోసం కొత్త క్రూయిజ్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. యాఘాట్-గుప్తర్‌ఘాట్ మధ్య 'జటాయువు' క్రూయిజ్ సర్వీసును నడపడానికి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అనుమతినిచ్చింది.

సాయంత్రం 5 గంటలకు భారీ కార్యక్రమంతో 'జటాయు' క్రూయిజ్ సర్వీస్ ప్రారంభమైంది. రామాయణం ఇతివృత్తంగా జటాయువు అనే క్రూయిజ్‌ను సిద్ధం చేశారు. రామాయణంలోని ప్రసిద్ధ భాగాలు ఈ క్రూయిజ్ పై చిత్రీకరించారు.

క్రూయిజ్‌లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విశాల్ సింగ్ తెలిపారు. ఈ క్రూయిజ్ సర్వీస్ ఆపరేటింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రెండు ఘాట్‌ల మధ్య రౌండ్ ట్రిప్ ధర రూ.300.

పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ జటాయువు క్రూయిజ్ బోట్‌లో 100 మంది కూర్చునే సదుపాయం ఉంది. ఇది మిమ్మల్ని సరయూ నది గుండా నగరంలోని అందమైన ఘాట్‌లు, దేవాలయాల పర్యటనకు తీసుకెళ్తుంది. రైడ్ సమయంలో సరయూ నది ఆరతిని కూడా సందర్శించుకోవచ్చు. ప్రయాణ సమయంలో ప్రయాణీకులకు ఆహారం, స్నాక్స్ కూడా అందించనున్నారు.

ప్రీమియం క్రూయిజ్ సర్వీస్ అయిన అయోధ్యలో 'జటాయువు' మొదటి సర్వీస్ అవుతుంది. ఇది కాకుండా 'పుష్పక్' పేరుతో మరో క్రూయిజ్ సర్వీస్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నారు. ఈ పుష్పక్ అనే ఈ క్రూయిజ్ భారీగా ఉంటుంది. ఇందులో సుమారు 150 మంది ప్రయాణికులు కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు.