Kanuma 2023: కనుమ రోజున మినుము తినాలని.. ప్రయాణాలు వద్దని అంటారు.. రీజన్ ఏమిటంటే

పశువుల పట్ల కృతజ్ఞతను తెలుపుతూ.. రైతులు కనుమ రోజున వాటిని శుభ్రం చేసి.. అందంగా అలంకరిస్తారు. పూజ చేసి హారతి ఇచ్చి.. అతికిష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఉత్సవంగా ఊరేగిస్తారు. అంతేకాదు కనుమ రోజున కాకి అయినా కదలదని.. మినుము తినమని సామెతలు వాడుకలో ఉన్నాయి. 

Kanuma 2023: కనుమ రోజున మినుము తినాలని.. ప్రయాణాలు వద్దని అంటారు.. రీజన్ ఏమిటంటే
Kanuma Festival

Edited By:

Updated on: Jan 16, 2023 | 6:20 AM

హిందువుల అతి పెద్ద పండగ సంక్రాంతి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మూడో రోజు జరుపుకునే కనుమని పశువుల పండుగ అని అంటారు. పశువులను తమ ఇంటి సంపదగా భావించి కనుమ రోజున పూజిస్తారు. పశువుల పట్ల కృతజ్ఞతను తెలుపుతూ.. రైతులు కనుమ రోజున వాటిని శుభ్రం చేసి.. అందంగా అలంకరిస్తారు. పూజ చేసి హారతి ఇచ్చి.. అతికిష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఉత్సవంగా ఊరేగిస్తారు. అంతేకాదు కనుమ రోజున కాకి అయినా కదలదని.. మినుము తినమని సామెతలు వాడుకలో ఉన్నాయి.

గోదావరి జిల్లాలో కనుమ అంటే గుర్తుకొచ్చేది గారెలు.. ఈరోజు కోడిని తమ ఇంటి దేవతకు నైవేద్యంగా పెట్టి.. గారెలు కోడి కూరని చేస్తారు. తమ ఇంటి పెద్దలకు వీటిని ప్రసాదంగా పెడతారు. మాంసం తినని వారికి, మంచి పోషకాలను ఇచ్చేవి మినుములు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి’ అనే సామెత మొదలైందని అంటారు. మినుములు శీతాకాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.

అంతేకాదు కనుమ రోజున ప్రయాణం చేయకూడదని, శుభకార్యాలు  చేయకూడదని అంటారు. ఇలా పెద్దలు చెప్పడం వెనుక ఒక కారణం కూడా ఉందట. కనుమ రోజు తమ పెద్దలను తలచుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి గడుపుతారు.  తమ పెద్దలను తలచుకుని  ప్రయాణం చేసి సరదాగా షికార్లు కొట్టడం అనేది సంస్కృతికి విరుద్ధం.  విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకనే కనుము రోజున కాకైనా కదలదని .. పండగకు ఇంటికి వచ్చిన వారు ప్రయాణం చేయవద్దని .. ఒకవేళ  చాదస్తం అంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఇబ్బందులు తప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Loading...
Unable to load recommendations.
Follow Us