Zodiac Signs: ఈ 5 రాశుల వారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట.. అతికినట్టే ఉంటాయ్..

|

Aug 01, 2022 | 11:41 AM

తనకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరి నుంచి వెళ్లిపోవడానికి.. వారిని ఇక ఎప్పటికీ కలవకూడదు అనుకున్న సందర్భంలో అబద్దాలు చెప్తారు.

Zodiac Signs: ఈ 5 రాశుల వారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట.. అతికినట్టే ఉంటాయ్..
Zodiac Signs
Follow us on

సాధారణంగా ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మనిషి సులువుగా అబద్దాలు చెప్పేస్తుంటాడు. తనకు ఇష్టం లేని వ్యక్తుల దగ్గరి నుంచి వెళ్లిపోవడానికి.. వారిని ఇక ఎప్పటికీ కలవకూడదు అనుకున్న సందర్భంలో అబద్దాలు చెప్తారు. అలాగే ఇతరుల సహాయాన్ని ఆశిస్తున్న సమయంలోనూ తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తుంటారు. వాస్తవానికి ప్రస్తుతం కాలంలో 99 శాతం మంది సులభంగా అవాస్తవాలు మాట్లాడేస్తుంటారు. ఇతరులు వారి మాటలను విశ్వసించే విధంగా తమ మాట్లాడతారు. అయితే కొన్ని రాశి చక్రాలు ఈ లక్షణాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కొన్ని సూర్య సంకేతాలు అప్రయత్నంగా అబద్దాలు చెబుతాయి. ఎంతగా అంటే అసలైన నిజాన్ని కూడా అవాస్తవమని భావించే విధంగా ఉంటాయి వారి మాటలు. ప్రముఖ జ్యోతిష్య పండితుడు జగన్నాథ్ గురూజీ తేలిగ్గా అబద్ధాలు చెప్పే ఐదు రాశుల గురించి కీలకవిషయాలు చెప్పారు.

మిథున రాశి..
ఈ రాశివారు చాలా సహజంగా అబద్ధం చెప్తారు. వారు కొన్ని పనుల నుంచి బయటపడేందుకు ఎటువంటి భయం లేకుండా అబద్దాలు మాట్లాడతారు. అలా చేయడానికి వారు ఉపయోగించే సృజనాత్మకత వారి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. కానీ వారి మాటలను బట్టి వారు చెప్పేది అబద్ధం అని సులభంగా తెలుసుకోవచ్చు.

వృశ్చిక రాశి..
వీరు తమకు విలువ లేని వాటిని నివారించడానికి అబద్దాలు మాట్లాడుతారు. వీరికి తమ మాటలను తారుమారు చేయడం చాలా తేలిక. అంతేకాదు మోసపూరిత గుణం ఎక్కువగా ఉంటుంది. మీరు అబద్ధం అని గుర్తుపట్టలేనంతవరకు వీరు అబద్దాలు చెబుతూ మోసం చేస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మీనరాశి..
ఈ రాశివారు చెడు ఆలోచనలు, సున్నితత్వం, సృజనాత్మకత కలగలపి ఉంటారు. వీరు కోరుకున్నది సాధించడానికి ఎలాంటి దారులను ఎంచుకోవడానికైనా సిద్ధమవుతారు. వారి ప్రవర్తన.. విలువను ఇతరులు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఏం చెప్పాలి అనేది ముందుగానే నిర్ణయించుకుంటారు.

తులారాశి..
వీరు ఆలోచనలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఈరాశివారు ఇతరులను చాలా సులభంగా సందీగ్దంలో పడేస్తారు. వీరి అబద్ధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి.. వారు కోరుకున్నది పొందడం కోసం అబద్దాలు చెబుతారు. అయితే వీరు తాము చెప్పిన అబద్ధాలను అస్సలు గుర్తుపెట్టుకోరు. వారు మాట్లాడిన మాటలను మర్చిపోతారు. గుర్తుతెచ్చుకోలేరు.

కుంభరాశి..
వీరు చెప్పే అబద్దాలు అంతగా ప్రమాదకరమైనవి కాదు. ఇతరులకు ఎక్కువగా నష్టం కలిగించవు. కానీ అబద్ధాలు చెప్పడం మాత్రం ఆపరు. ఇతరులను బాధపెట్టకూడదు.. శాంతిని పెంపోందించడానికి.. అర్థం చేసుకునే వ్యక్తులను బాధించకుండా ఉండేందుకు అబద్ధాలు చెప్తుంటారు. కానీ నిజం బయటపడిన సమయంలో వీరు చెప్పిన అబద్దాలు ఎదురుదెబ్బ తగలవచ్చు.

Note: (ఈ రాశుల ప్రవర్తనలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)