Black Cloths: ఆ 2 రోజుల్లో నల్లని వస్త్రాలు ధరించకూడదు..? పూర్వీకులు చెబుతున్న కారణాలు ఇవే..

Black Cloths: సనాతన హిందూ ధర్మం ప్రపంచ సంస్కృతులలో కెల్లా ఎంతో విభిన్నమైనది. పాటించే ప్రతి విషయం ప్రకృతితో, నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం నల్లని బట్టలు ధరించకూడదనే నమ్మకం ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదంటున్నారు పెద్దలు. నలుపు, డీప్ డార్క్ కలర్..

Black Cloths: ఆ 2 రోజుల్లో నల్లని వస్త్రాలు ధరించకూడదు..? పూర్వీకులు చెబుతున్న కారణాలు ఇవే..
Black Dress

Updated on: Jun 18, 2023 | 5:40 AM

Black Cloths: సనాతన హిందూ ధర్మం ప్రపంచ సంస్కృతులలో కెల్లా ఎంతో విభిన్నమైనది. పాటించే ప్రతి విషయం ప్రకృతితో, నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. ఈ క్రమంలోనే సోమవారం, మంగళవారం నల్లని బట్టలు ధరించకూడదనే నమ్మకం ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదంటున్నారు పెద్దలు. నలుపు, డీప్ డార్క్ కలర్ ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా పరిగణించబడుతుంది. అందుకే పండుగ, శుభకార్యల్లో నల్లని దుస్తులు ధరించడం నిషేధంగా భావిస్తారు. ఇంకా నలుపు ఎక్కడ ఉంటే అక్కడ శోకం ఉంటుందని మన పూర్వీకులు నమ్ముతుండేవారు.

ముఖ్యంగా ఆదిపురుషుడైన శివుడికి అంకితం చేసిన సోమవారం, భక్తాగ్రేస ఆంజనేయుడికి అంకితం అయిన మంగళవారం రోజుల్లో నలుపు బట్టలు మంచిది కాదు. పైగా నలుపు రంగు చీకటి, మరణంతో ముడిపడి ఉంటుంది కాబట్టి, ఆయా రోజుల్లో ఈ రంగును ధరించకుండా ఉండటం మంచిదని చెబుతారు. కావాలంటే శివుడికి ఇష్టమైన ముదురు నీలం, హనుమంతుడికి ప్రీతిపాత్రమైన సింధూరం రంగు బట్టలను ధరించవచ్చని పండితులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us