హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు IRCTC టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే!

IRCTC Ganga Ramayan Yatra Package: హైదరాబాద్ నుంచి కాశీ, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్య క్షేత్రాలను సందర్శించేందుకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. విమాన ప్రయాణంతో 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ యాత్ర డిసెంబర్ 2026, ఫిబ్రవరి 2027లో అందుబాటులో ఉంది. ప్యాకేజీ ధరలు, ప్రయాణ తేదీలు, సందర్శన స్థలాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనకు IRCTC టూర్ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే!
Irctc Ganga Ramayan Yatra Package

Updated on: Nov 25, 2026 | 8:53 PM

IRCTC Ganga Ramayan Yatra Package: హిందూ ధర్మంలో గంగానది, కాశీ, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర ప్రదేశాలను సందర్శించాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా Ganga Ramayan Yatra టూర్ ప్యాకేజీని అందిస్తోంది. విమాన ప్రయాణం ద్వారా ఆరు రోజుల్లో ఐదు ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.

టూర్ ప్యాకేజీ వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ కోడ్ SHA10. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్‌కు సంబంధించి రెండు తేదీలను IRCTC ప్రకటించింది.

  • మొదటి తేదీ: 16 డిసెంబర్ 2026
  • రెండో తేదీ: 20 ఫిబ్రవరి 2027

ఆరు రోజుల యాత్ర షెడ్యూల్

  • మొదటి రోజు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం (6E 915) ఉదయం 10:25 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:10 గంటలకు వారణాసి చేరుకుంటుంది. హోటల్‌లో భోజనం తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, గంగా ఘాట్‌లను సందర్శిస్తారు.
  • రెండో రోజు అల్పాహారం అనంతరం సారనాథ్, బిర్లా ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం గంగా ఘాట్‌ల వద్ద గడపవచ్చు.
  • మూడో రోజు ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి అలోపీ దేవి ఆలయం, త్రివేణి సంగమాన్ని దర్శించుకుంటారు. అనంతరం అయోధ్యకు చేరుకుని అక్కడే బస చేస్తారు.
  • నాలుగో రోజు అయోధ్య ఆలయ సందర్శన అనంతరం లక్నోకు ప్రయాణిస్తారు.
  • ఐదో రోజు నైమిశారణ్య క్షేత్రాన్ని సందర్శించి తిరిగి లక్నో చేరుకుంటారు.
  • ఆరో రోజు బడా ఇమాంబారా సందర్శన అనంతరం సాయంత్రం 4 గంటలకు లక్నో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 8:20 గంటలకు బయలుదేరే విమానం ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు ఇలా

డిసెంబర్ టూర్‌కు సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.46,050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.34,300గా ఉంది. ఫిబ్రవరి టూర్‌కు ఈ ధరలు వరుసగా రూ.47,100, రూ.36,400, రూ.34,700గా ఉన్నాయి. పిల్లలకు వయసును బట్టి ప్రత్యేక ధరలు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?

విమాన టికెట్లు, హోటల్ వసతి, 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు, ఒక లంచ్, ఏసీ బస్సు ద్వారా స్థానిక సందర్శనలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సేవలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, టూర్ గైడ్ సేవలు, అదనపు భోజనం, వ్యక్తిగత ఖర్చులు మాత్రం ప్యాకేజీలో ఉండవు.

ప్రస్తుతం ఈ టూర్‌లో మొత్తం 29 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

గంగా రామాయణ యాత్ర గురించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

 

Loading...
Unable to load recommendations.
Follow Us