Horoscope Today (18-10-2022): చాలామంది రోజు మొదలైందంటే చాలు .. ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 18 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభకాలం. ధనం చేతికి అందుతుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయకండి.. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోండి. ప్రారంభించిన పనులల్లో ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించండి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. దైవ దర్శనం శుభప్రదం.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఒక విషయంలో కుటుంబ సభ్యల సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. అనుకూల సమయం… ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పని పూర్తి అవుతుంది. ఒక వార్త లేదా సంఘటన లేదా బాధ కలిగిస్తుంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకాలం. అవసరానికి తగిన డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తి విషయంలో లావాదేవీలు జరుగుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధను కలిగించే వార్తను వింటారు. ముఖ్య విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి. మానసిక ప్రశాంతతను కోల్పోయే ఘటన చోటు చేసుకుంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. లక్ష్యాలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాల కోసం అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో మానసిక ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక విషయాల్లో ఆచితూచి వ్యవరించాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అనవరస వివాదాలకు దూరంగా ఉండండి. శాంతంగా వ్యవహరించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం