
పూరీ జగన్నాథ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జగన్నాథస్వామి రథంపై ఊరేగనున్నారు. స్వామివారి రథయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాప్తి విస్తరణ నేపథ్యంలో భక్తులంతా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఏ ఒక్కరూ కూడా రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావద్దని ఆలయ ప్రధాన సేవకులు కోరారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా ఈసారి రథయాత్రకు భక్తులను అనుమతించడంలేదు. కేవలం అర్చకులు, ఆలయ సిబ్బంది మాత్రమే రథయాత్రలో పాల్గొననున్నారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులంతా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. కేవలం అర్చకులు, ఆలయ సిబ్బంది మాత్రమే రథయాత్రలో పాల్గొననున్నారు. వీరితోపాటు ఎంపిక చేసిన కొద్ది మంది భక్తులను రథం లాగేందుకు అనుమతి ఇచ్చారు. వారికి ముందుగానే కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది.
అంతే కాదు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేశారు. ఏ ఒక్కరూ కూడా రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావద్దని ఆలయ ప్రధాన సేవకులు కోరారు. ప్రజలంతా ఎవరి ఇండ్లలో వాళ్లు ఉండి టీవీల్లో ప్రత్యేక్ష ప్రసారం ద్వారా రథయాత్రను వీక్షించాలని సూచించారు.