Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

Spiritual beliefs: హిందూ సంప్రదాయంలో శనివారం ప్రత్యేకమైన ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ రోజు శని దేవుడికి అంకితమై ఉంటుంది, శని గ్రహాన్ని కర్మ ఫలదాతగా భావిస్తారు. అందుకే శనివారం చేసే కొన్ని పనులు వ్యక్తి జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. అయితే, శనివారం ఏ పనులు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఈ విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?
Saturday Tips

Updated on: Jan 17, 2026 | 6:00 AM

హిందూ సంప్రదాయంలో శనివారంకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు శని దేవుడికి అంకితమై ఉంటుంది. శని గ్రహం కర్మఫలదాతగా భావిస్తారు. అందుకే శనివారం చేసే కొన్ని పనులు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. మరి శనివారం ఏ పనులు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

శనివారం ఈ పనులు అస్సలు చేయకూడదు

1. జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దు

శనివారం జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటే.. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసుకు అశాంతి కలిగే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి.

2. ఇనుము వస్తువులు కొనడం లేదా అమ్మడం

శని దేవుడికి ఇనుముతో సంబంధం ఉంటుంది. శనివారం ఇనుము వస్తువులు కొనుగోలు చేయడం లేదా అమ్మడం వల్ల నష్టం, అనుకోని సమస్యలు
ఎదురవుతాయని నమ్మకం.

3. నూనె దానం తప్ప, నూనె రాసుకోవద్దు

శనివారం తలకి నూనె రాసుకోవడం మంచిది కాదని భావిస్తారు. కానీ, నువ్వులు నూనె లేదా ఆవ నూనె దానం చేయడం మాత్రం శుభకరం. ఇది శని దోషం తగ్గించేందుకు ఉపయోగపడుతుందని నమ్మకం.

4. అబద్ధాలు, ఇతరులను బాధపెట్టడం

శని దేవుడు న్యాయానికి ప్రతీక. శనివారం అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం చేస్తే కర్మఫలితాలు వెంటనే వస్తాయని, జీవితంలో ఆటంకాలు పెరుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.

5. మద్యం, మాంసాహారం దూరంగా ఉంచాలి

శనివారం మద్యం, మాంసాహారం తీసుకోవడం వల్ల మనస్సు అస్థిరంగా మారడం, శని ప్రభావం తీవ్రంగా పడటం జరుగుతుందని విశ్వాసం.

శనివారం చేయాల్సిన మంచి పనులు

పేదలకు నల్ల వస్త్రాలు, నువ్వులు, నూనె, ఆహారం దానం చేయడం శుభప్రదం.

“ఓం శం శనైశ్చరాయ నమః” ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

శనివారం హనుమంతుని దర్శనం చేయడం వల్ల శని దోషం తగ్గి, భయాలు తొలగుతాయని శాస్త్రోక్తి.

శనివారం ఈ జాగ్రత్తలు పాటిస్తే… అనవసర సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. శనివారం చేసే చిన్న పొరపాటు కూడా జీవితంలో పెద్ద ఇబ్బందులకు దారితీయవచ్చని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ నియమాలను గౌరవిస్తూ, శుభకార్యాలు చేస్తే శని దేవుడి కృప తప్పక లభిస్తుందని విశ్వాసం. దీంతో మీకు సానుకూల ఫలితాలు లభిస్తాయి.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు ధృవీకరించదు.)