హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి దీపాల పండుగ దీపావళి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానంకి గుర్తుగా అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటాం. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజున నరక చతుర్దశి గా.. మర్నాడు లోకానికి అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు అమావాస్య రోజున దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం చేసిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళి పండుగను జరుపుకున్నారని మరొక పురాణకథనం. రాముడు తన భార్య సీత సోదరుడు లక్ష్మణ్ కలిసి వనవాసానికి వెళ్ళాడు. రావణుడిని సంహరించి వనవాసం ముగించుకుని రాముడు తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చారని నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో చీకటి రాత్రి కావడంతో, అయోధ్య ప్రజలు మట్టి దీపాలతో వీధులను వెలిగించి ఆయనకు స్వాగతం పలికారు. నేటికీ, శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును దీపావళిగా జరుపుకునే సాంప్రదాయం కొనసాగిస్తూనే ఉన్నారు. దీపావళిని హిందువులు ఉత్సాహంగా , శుభప్రదంగా జరుపుకుంటారు.
అయితే ఈ ఏడాది దీపావళి అమావాస్య రెండు రోజులుగా వచ్చింది. అమావాస్య తిథి అక్టోబర్ 24వ తేదీ, 2022న సాయంత్రం 05:27 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 25వ తేదీ, 2022న సాయంత్రం 04:18 గంటలకు ముగుస్తుంది. దీంతో దీపావళి పండగను ఎప్పుడు జరుపుకోవాలి అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. 25వ తేదీన సూర్యగ్రహణం తో పాటు.. రాత్రికి పాడ్యమి తిథి వస్తుంది కనుక.. ఈ ఏడాది దీపావళి పండగ శుభ సమయం అక్టోబర్ 24వ తేదీనే అని పండితులు చెబుతున్నారు.
దీపావళి 2022: తేదీ, పూజ సమయం
ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 24, 2022 న జరుపుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)