Ram Mandir Darshan Time: అయోధ్య వెళ్లే వారికి ముఖ్య గమనిక.. రామ మందిరం దర్శన సమయంలో మార్పులు..ఇది గమనించండి..

|

Jan 24, 2024 | 5:56 PM

భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగి.. ప్రాణప్రతిష్ఠ పూర్తైంది.. గర్బాలయంలో బాలరాముడి విగ్రహాన్ని జనవరి 22 సోమవారం రోజున అత్యంత వైభవోపేతంగా, భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. మంగళవారం నుంచి భక్తుల దర్శనాలకు అనుమతినిచ్చారు.. దీంతో అయోధ్యను దర్శించుకోడానికి రామ భక్తులంతా తహతహలాడుతున్నారు. ఆలయాన్ని తెరిచిన తొలిరోజే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు.

Ram Mandir Darshan Time: అయోధ్య వెళ్లే వారికి ముఖ్య గమనిక.. రామ మందిరం దర్శన సమయంలో మార్పులు..ఇది గమనించండి..
Ayodhya Ram Mandir Darshan
Follow us on

Ayodhya Ram Mandir: ఐదు వందల సంవత్సరాల తర్వాత రామ జన్మభూమి పులకించిపోయింది.. శ్రీరాముడు పుట్టిన నేల అయోధ్యలో భక్తుల చిరకాల స్వప్నం సాకారమైంది..అయోధ్యలో రామాలయ నిర్మాణంతో భక్తులు పరవశించిపోతున్నారు. అయోధ్య నగరిలో ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా రామనామంతో మారుమోగుతోంది. భవ్యమైన రామమందిర నిర్మాణం జరిగి.. ప్రాణప్రతిష్ఠ పూర్తైంది.. గర్బాలయంలో బాలరాముడి విగ్రహాన్ని జనవరి 22 సోమవారం రోజున అత్యంత వైభవోపేతంగా, భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. మంగళవారం నుంచి భక్తుల దర్శనాలకు అనుమతినిచ్చారు.. దీంతో అయోధ్యను దర్శించుకోడానికి రామ భక్తులంతా తహతహలాడుతున్నారు. ఆలయాన్ని తెరిచిన తొలిరోజే దాదాపు ఐదు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న దృష్ట్యా ఆలయ నిర్వాహకులు దర్శనం సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయోధ్య రామ మందిర సందర్శన సమయం, నియమాలు:

ఇవి కూడా చదవండి

అయోధ్యలోని రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున దర్శనం సమయాన్ని పొడిగిస్తూ పరిపాలన విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భక్తులు రాత్రి 7:00 గంటలకు బదులుగా రాత్రి 10:00 గంటల వరకు రామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చు. ఉదయం పూట దర్శనాలు ఉదయం 7 నుండి 11.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఇక, అధికారిక వర్గాల ప్రకారం, ఆలయంలో దర్శనం కోసం సుమారు ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యలో విడిది చేస్తున్నారని చెప్పారు. అయితే, మరో 10-15 రోజుల తర్వాత అయోధ్యకు వచ్చి రామ్ లల్లా దర్శనం చేసుకోవాలని అయోధ్య జిల్లా యంత్రాంగం భక్తులకు విజ్ఞప్తి చేసింది.

ఇకపోతే, అయోధ్య రామాలయం దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీ నేపథ్యంలో అక్కడి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎనిమిది వేల మందికి పైగా పోలీసులు ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) సంజయ్ ప్రసాద్ కూడా పరిస్థితిని పర్యవేక్షించడానికి అయోధ్యలో క్యాంప్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…