భార్యాభర్తల అనుబంధం.. చాణక్యుడి సిక్రెట్ టిప్స్‌తో హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!

Husband wife secrets: చాణక్యుడు చెప్పిన వివాహ సూత్రాలు బలమైన, సంతోషకరమైన వైవాహిక జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. మోసం, అనుమానం, ఆధిపత్యం వంటివి బంధాన్ని ఎలా బలహీనపరుస్తాయో ఆయన వివరించారు. భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని, ప్రేమ, గౌరవంతో జీవిస్తే వారి ఇల్లు స్వర్గతుల్యం అవుతుందని, ఇది కలకాలం నిలిచే బంధానికి మూలమని ఆయన బోధనలు స్పష్టం చేస్తున్నాయి.

భార్యాభర్తల అనుబంధం.. చాణక్యుడి సిక్రెట్ టిప్స్‌తో హ్యాపీ లైఫ్ గ్యారంటీ..!
Happy Married Life

Updated on: Feb 17, 2026 | 12:14 PM

Chanakyas Principles for a Successful Marriage: మానవ జీవితంలో పెళ్లి ఒక కీలకమైన మలుపు, ఇది మనిషి సుఖ సంతోషాలకు మూలంగా నిలుస్తుంది. వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని నిజాయితీగా, ప్రేమగా ఉంటే ఆ గృహం స్వర్గంతో సమానం. అదే ఇద్దరి మధ్య అరమరికలు ఉంటే, ఆ బంధం అర్థరహితంగా మారుతుంది. వైవాహిక బంధం కలకాలం బలంగా ఉండాలంటే ఏం చేయాలి, భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మెలగాలి అనే విషయాలపై చాణక్యుడు విలువైన సూచనలు అందించాడు. అంతేకాకుండా, వైవాహిక జీవితం ఎందుకు వైఫల్యం అవుతుందో కూడా ఆయన వివరించాడు.

ఆ సంబంధాలు అసలే వద్దు

చాణక్యుడు వైవాహిక బంధానికి హాని కలిగించే అనేక అంశాలను స్పష్టంగా పేర్కొన్నాడు. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే, ఆ బంధం క్షణాల్లోనే తెగిపోతుందని ఆయన హెచ్చరించాడు.

పెత్తనం వద్దు..

పురుషుడు తన సొంత విషయాల్లో అతిగా జోక్యం చేసుకున్నా, అదుపు చేయడానికి ప్రయత్నించినా స్త్రీలు దానిని అంగీకరించరని, దీనివల్ల వారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుందని వివరించాడు. అదేవిధంగా, భర్తలపై పెత్తనం చేయాలని ప్రయత్నించే భార్యల జీవితం కూడా నరకమే అవుతుందని చాణక్యుడు చెప్పాడు.

అదే పెద్ద జబ్బు..

అనుమానాన్ని మించిన జబ్బు లేదని, జీవిత భాగస్వామి ప్రేమను, బంధాన్ని అనుమానించే భార్య లేదా భర్త తమ హద్దుల్ని దాటి దూషించుకుంటారు, దీనివల్ల వారి మధ్య శత్రుత్వం మరింత పెరుగుతుందని ఆయన బోధనలు స్పష్టం చేస్తాయి. కుటుంబంలో పెద్దలు, చిన్న పిల్లల పట్ల గౌరవం లేకుండా, తమ బాధ్యతల్ని పక్కన పెట్టి దురాశగా ఉండే ఆడవారి వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు తప్పవని చాణక్యుడు నొక్కి చెప్పాడు.

భాగస్వామి ఎంపిక ఇదే ముఖ్యం

వివాహ భాగస్వామి ఎంపిక విషయంలోనూ చాణక్యుడు కొన్ని ముఖ్యమైన సూచనలు అందించాడు. ప్రతి మగాడు అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకున్నప్పటికీ.. అమ్మాయి అందంగా ఉన్నా మంచి కుటుంబం కాకపోతే అలాంటి వారిని వివాహం చేసుకోకూడదని చాణక్యుడు తెలిపాడు. వధువు అందంగా లేకపోయినా పర్వాలేదు, ఆమె కుటుంబానికి మాత్రం విలువలు ఉండాలి. దీనివల్ల బంధం బలపడి రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. తమకు సరితూగే వారితోనే సంబంధాలు నెరుపుకోవాలి. ఒకవేళ పురుషుడు ఆస్తిపాస్తుల్లో తక్కువగా ఉన్నా ఇల్లరికం మాత్రం పోకూడదు, దీనివల్ల అతనికి సమాజంలో గౌరవం తగ్గిపోతుందని చాణక్యుడు వివరించాడు.

వైవాహిక బంధం బలంగా ఉండాలంటే..

వైవాహిక బంధం బలంగా ఉండటానికి చాణక్యుడు ప్రేమ, బాధ్యతలను ప్రాథమిక సూత్రాలుగా పేర్కొన్నాడు. భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి, ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. భర్తకు అనుకూలంగా భార్య, భార్యకు నచ్చినట్టుగా భర్త ఉండటమే కాకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటే ఇద్దరికీ సమాజంలో గౌరవం ఉంటుంది. నిజాయితీ, తెలివైన స్త్రీ మంచి భార్యగా ఉంటుందని, ఎల్లప్పుడూ భర్త పట్ల ప్రేమతో ఉండి కుటుంబంలో శాంతి, సామరస్యాల కోసం పాటుపడుతుందని చాణక్యుడు తెలిపాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను గాయపరచకూడదు. దీనివల్ల విపరీతమైన పరిణామాలు ఎదురవుతాయి. పురుషుడు కుటుంబంలో ఇతర స్త్రీలతోనూ తగాదా పెట్టుకోరాదని, దీనివల్ల బాంధవ్యాలకు మరింత చేటు కలుగుతుందని చాణక్యుడు బోధించాడు. ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

 

Loading...
Unable to load recommendations.
Follow Us