Telugu News Spiritual Chanakya niti these people are more dangerous than enemy in telugu
Chanakya Niti: ఈ నేచర్ కలిగిన వ్యక్తులు శత్రులకంటే ప్రమాదం.. వీలైనంత దూరంగా ఉండమంటున్న చాణక్య
హానికలిగించే కొందరికి దూరంగా ఉండడం మేలు అని ఆచార్య చాణక్యుడు తన విధానంలో వివరించాడు. మనం పొరపాటున కూడా కొందరిని సహాయం అడగకూడదు.. వీలైనంత దూరంగా ఉండలని సూచించారు.
ఆచార్య చాణక్య దౌత్యవేత్త, రాజకీయవేత్త. చాణక్యుడు విధానాలను అనుసరించి ప్రజలు ప్రపంచాన్ని పాలించారు. తమ నీతిశాస్త్రంలో చెప్పిన మాటలు నేటికీ అనుసరించదగినవి. జీవితంలో విజయాన్ని సాధించడంలో మనిషికి సహాయపడే విషయాలను విధానాలను, నియమాలను తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. హానికలిగించే కొందరికి దూరంగా ఉండడం మేలు అని ఆచార్య చాణక్యుడు తన విధానంలో వివరించాడు. మనం పొరపాటున కూడా కొందరిని సహాయం అడగకూడదు.. వీలైనంత దూరంగా ఉండలని సూచించారు.
ఈ వ్యక్తుల నుండి దూరంగా ఉండండి
చాణక్య విధానం ప్రకారం.. జీవితంలో నీచమైన వ్యక్తిని ఎప్పుడూ నమ్మకూడదు. నీచమైన వ్యక్తులు మీకు మేలు చేసే బదులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు.
ఆచార్య చాణక్యుడు ప్రకారం..అలాంటి వ్యక్తులు తమ స్వార్థం కోసం ఇతరులకు హాని చేయడానికి కూడా వెనుకాడరు. శత్రువులు ముందు నుండి మోసం చేస్తారు.. ఇలాంటి స్వార్ధమనసతత్వం ఉన్న వ్యక్తులు వెనుక నుండి హాని చేయవచ్చు.
చాణక్య నీతి ప్రకారం.. ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తికి దూరం పాటించడం మంచిది. కోపంతో ఉన్న వ్యక్తి తనతో పాటు.. ఇతరులకు హాని కలిగించవచ్చు. కోపంతో ఉన్న వ్యక్తి శత్రువుల కంటే ప్రమాదకరమని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి వారికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇస్తున్నాడు.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితంలో అత్యాశ, అసూయపడే వ్యక్తి నుండి ఎల్లప్పుడూ దూరం ఉండాలని చెప్పాడు. పొరపాటున కూడా అలాంటి వారి నుండి సహాయం కోరకూడదు.