Chanakya Niti: ఇంట్లో ఆర్థిక సంక్షోభం కలగకూడదంటే.. డబ్బుకు సంబంధించిన ఈ 5 విషయాలను ఎప్పటికీ మర్చిపోకండి

|

Feb 26, 2022 | 8:47 PM

Chanakya Niti: డబ్బు వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) చెప్పాడు. డబ్బు వలన చాలా ఉపయోగాలున్నాయని తన నీతి శాస్త్రం(Niti Shastra)లో  చాణుక్యుడు వివరించాడు..

Chanakya Niti: ఇంట్లో ఆర్థిక సంక్షోభం కలగకూడదంటే.. డబ్బుకు సంబంధించిన ఈ 5 విషయాలను ఎప్పటికీ మర్చిపోకండి
Chanakya Niti
Follow us on

Chanakya Niti: డబ్బు వల్ల మనిషికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) చెప్పాడు. డబ్బు వలన చాలా ఉపయోగాలున్నాయని తన నీతి శాస్త్రం(Niti Shastra)లో  చాణుక్యుడు వివరించాడు. అదే సమయంలో డబ్బును సంపాదించడానికి ఖర్చు చేయడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయని సూచించాడు. మీరు కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకూడదని కోరుకుంటే.. డబ్బుకు సంబంధించిన ఆచార్య చెప్పిన ఈ విధానాన్ని గుర్తుంచుకోవాల్సిందేనని పెద్దలు చెబుతుంటారు.

  1. డబ్బు ఒక వ్యక్తికి గౌరవాన్ని ఇస్తుందని, అన్ని విపత్తులను ఎదుర్కోవటానికి మార్గాన్ని కల్పిస్తుందని ఆచార్య చాణక్యుడు  నమ్మాడు. కనుక డబ్బును అనవసరంగా ఖర్చు చేయకూడదు. ఆపద సమయాల్లో మీకు ఉపయోగపడేలా డబ్బును దాచుకోవాలి. ఎవరికైనా గడ్డు కాలంలో డబ్బు ఉంటే చాలు.. సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు.
  2. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండకూడదని మీరు కోరుకుంటే..  ఎప్పుడూ తప్పు మార్గంలో సంపాదించవద్దు. ఆదాయం కోసం తప్పుడు మార్గాన్ని అవలంభిస్తే.. అలా  సంపాదించిన డబ్బులు వెంటనే పోతాయి. అంతేకాదు అవినీతి మార్గంలో సంపాదించే వ్యక్తి త్వరగా నాశన అంచుకు చేరుకుంటాడు. కాబట్టి మనిషి డబ్బులను కష్టపడి సంపాదించాలని.. అప్పుడే అది నిలబడుతుందని చాణుక్యుడు సూచించాడు.
  3. ధనాన్ని శుభ కార్యాల కోసం విరివిగా వినియోగించాలి. ఒక వ్యక్తి తన జీవితంలో తప్పనిసరిగా దానాలు చేయాలి. అయితే, అలా ఇచ్చే విరాళాలకు పరిమితులుండాలని..  అవసరానికి మించి దానం చేసినా ఇబ్బందులు తప్పవని చాణక్య చెప్పాడు.
  4. సంపదను పెంచుకోవడానికి పెట్టుబడి ఉత్తమ మార్గం.  డబ్బును పొదుపు పేరుతొ మీ దగ్గర ఉంచుకుంటే.. అది కచ్చితంగా ఏదో ఒకరోజు ఖర్చవుతుంది. అందువల్ల.. డబ్బును రెట్టింపు చేసుకోవడానికి ఆస్తి, పాలసీ, బంగారం మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టండి.
  5. డబ్బు సంపాదన చేసే పద్ధతులపై తప్పని సరిగా దృష్టి పెట్టమని సూచించాడు చాణక్య. అంతేకాదు ఎవరైనా తమకు  కావలసిన చోట.. తమకు అవసరమైన డబ్బు సంపాదించగలిగేంత సామర్థ్యాన్ని కలిగి ఉండాలని సూచించాడు.

Also Read:

మూడో ప్రపంచం యుద్ధం వస్తే ఎవరు ఎటువైపు నిలుస్తారు.. టీవీ9 ప్రత్యేక కథనం..