Chanakya Niti: ఒకొక్కసారి వైఫల్యం కూడా విజయానికి బాటలు వేస్తుంది అంటున్న చాణక్య..
ఒక వ్యక్తి తన లక్ష్యం, కష్టపడి పనిచేయడం, వైఫల్యం నుండి నేర్చుకోవడం తో విజయ ఫలితం నిర్దేశింపబడుతుంది. చాలా మంది తమ వైఫల్యాల నుంచి సక్సెస్ కు బాటలు వేసుకోవచ్చు అని చాణక్యుడు చెప్పాడు. ఇవి విజయానికి దారి బాటలు వేస్తాయి.
ఆచార్య చాణక్యుడు వ్యూహకర్త, గొప్ప ఆర్థికవేత్త. చాణక్యుడికి సమాజం పట్ల లోతైన అవగాహన ఉంది. తన జీవితంలో కలిగిన అనుభవాలను అనేక పుస్తకాలుగా రచించారు. వాటిల్లో నీతి శాస్త్రం, అర్ధ శాస్త్రం వంటివి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయి. చాణుక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్న విధానాలు నేటి కాలంలో కూడా అనుసరనీయం. అపజయం విజయానికి మొదటి మెట్టు. ఆచార్య చాణక్య ప్రకారం.. విజయం సాధించడానికి ప్రత్యేక సూత్రం అంటూ ఏమీ లేదు. ఇది ఒక వ్యక్తి తన లక్ష్యం, కష్టపడి పనిచేయడం, వైఫల్యం నుండి నేర్చుకోవడం తో విజయ ఫలితం నిర్దేశింపబడుతుంది. చాలా మంది తమ వైఫల్యాల నుంచి సక్సెస్ కు బాటలు వేసుకోవచ్చు అని చాణక్యుడు చెప్పాడు. ఇవి విజయానికి దారి బాటలు వేస్తాయి.
వైఫల్యం నుండి ఈ విషయాలు నేర్చుకోవచ్చు
అపజయానికి భయపడి నిర్ణయాలను మార్చుకునే వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు. తన ప్రయత్నాలు వైఫల్యం చెందినా విజయం అందేవరకూ కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
నిరాశ, అపజయాల మీదుగానే విజయపథం సాగుతుందనేది చేదు నిజం. మీరు ఏదైనా పనిలో విఫలమైతే, నిరుత్సాహపడకండి .. విజయం అందేవరకూ ప్రయత్నిస్తూ ఉండండి.