Ahobilam: అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ వాహనాలపై దర్శనమిచ్చారు. సోమవారం జ్వాలా నరసింహస్వామి ఏగువ అహోబిలంలో యోగనరసింహస్వామిగా దర్శనమిచ్చి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధిలోని గరుడ విమానంపై ప్రదక్షిణలు చేశారు.

Ahobilam: అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
Ahobilam

Updated on: Mar 19, 2024 | 7:11 AM

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి వివిధ వాహనాలపై దర్శనమిచ్చారు. సోమవారం జ్వాలా నరసింహస్వామి ఏగువ అహోబిలంలో యోగనరసింహస్వామిగా దర్శనమిచ్చి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధిలోని గరుడ విమానంపై ప్రదక్షిణలు చేశారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి హంస వాహనంపై దర్శనమిచ్చి, మఠాధిపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భూదేవి అమ్మవారు, శ్రీదేవిలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. ప్రహ్లాద వరద నరసింహ స్వామి సూర్యప్రభ వాహనంపై రాత్రి ఆలయ వీధుల గుండా ఊరేగారు. అహోబిలం మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్, ఆలయ ప్రధాన అర్చకుడు కృతాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు.

అహోబిలం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంలో ఉన్న రెండు అందమైన ఆలయాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. స్థానిక పురాణం ప్రకారం ఇక్కడే విష్ణువు అవతారమైన నరసింహ స్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి హిరణ్యాక్షిపును సంహరించాడు. అహోబిలం నరసింహ ఆలయం మొత్తం తొమ్మిది దేవాలయాలలో ప్రధాన ఆలయం పురాతనమైనది. దిగువ అహోబిలం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఎగువ అహోబిలంపై అహోబిలం నరసింహ ఆలయం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు పూజలు చేసేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికతో పాటు ప్రశాంతవైన వాతావరణం భక్తులకు ఉల్లాసాన్ని ఇస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us