Badrinath Dham: ఉత్తరాఖండ్‌లో(Uttarakhand) చార్ ధామ్ (Char Dham) యాత్ర కొనసాగుతోంది. చార్ ధామ్ యాత్రలో చివరి ముఖ్యమైన బద్రీనాథ్ ఆలయం. ఆదివారం ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలో బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. వేసవిలో భక్తుల దర్శనార్ధం.. బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈరోజు ఉదయం 6:15 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో తెరవబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో బద్రీనాథ్ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పరిసరాలను సుమారు 20 క్వింటాళ్ల పువ్వలతో అలంకరించగా.. విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆలయం కాంతులీనింది. వచ్చే ఆరు నెలల పాటు భక్తులు ఆలయంలో బద్రీనాథ్ స్వామిని దర్శించుకోగలరు. ఈ ఉదయం బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరవగానే ఆలయం జై బద్రీనాథ్ నినాదాలతో మారుమోగింది. మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తితో నిండి పోయాయి. ఈరోజు ఆలయ తలుపులు తెరిచే ముందు స్వామివారి ఖజానాకు పూజలు నిర్వహించారు.
#WATCH | Uttarakhand: The doors of Badrinath Dham opened for devotees with rituals and chanting and the tunes of army band with a large number of devotees present in Badrinath Dham. pic.twitter.com/LiCTexcbJu
ఇవి కూడా చదవండి— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 8, 2022
మే 3 నుంచి ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర
మే 3న గంగోత్రి , యమునోత్రి ధామ్ తలుపులు తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 6వ తేదీ శుక్రవారం ఉదయం 6.15 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల కోసం తెరవబడ్డాయి. ఈసారి భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చార్ ధామ్‌కు వెళ్లే రోజువారీ భక్తుల సంఖ్యను పరిమితిని నిర్ణయించింది. బద్రీనాథ్‌లో రోజుకు 15,000 మంది, కేదార్‌నాథ్‌లో 12,000, గంగోత్రిలో 7,000, యమునోత్రిలో 4,000 మంది యాత్రికులకు అనుమతి ఇచ్చారు. 45 రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేశారు. కరోనా మహమ్మారి ప్రారంభమై సుమారు రెండు సంవత్సరాల తరువాత చార్ ధామ్ యాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..