Ugadi 2021: యుగాది” అని అంటే యుగానికి తొలి సమయంగా, ప్రారంభంగా ‘ఉగాది’ అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగు వారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోని ఛైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల దీన్ని “తెలుగు సంవత్సరానికి ప్రారంభ రోజుగా ఉగాదిగా పండుగను జరుపుకుంటాం.. ఈ నేపథ్యంలో శ్రీ ప్లవ నామ సంవత్సరాది సందర్భంగా ఏపీ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సీఎం శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలుగు వారికి, మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని జగన్ ఆకాంక్షించారు.
ఉగాదినాడు “పంచాంగ శ్రవణం” పరమోన్నతమై విరాజిల్లితే ఉగాది పచ్చడికి విశేష ఆరోగ్య ఛైతన్య ప్రాధాన్యత ఉందని … షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని… ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సుఖ దు:ఖాలు సమానమేనని అవి ప్రకృతిలోనే ఇమిడి ఉన్నాయని చెప్పటం దీని ఉద్దేశమని అన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి,చేదులు మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తాయని చెప్పారు.
Also Read: రోబో టెక్నాలజీ మహాభారతంలోనే ఉందా.. బార్బరీక్ ఎవరో తెలుసా..కృష్ణుడు ఎందుకు చంపాడంటే..!
ఆ దేశంలోని ఆటవిక తెగవారు ఆవును పవిత్రమైన జంతువుగా పూజిస్తారు.. ఎందుకంటే..! (photo gallery)