Lord Hanuman: రామ భక్త హనుమంతుడు(Lord Hanuman) వివిధ పేర్లతో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడిని పూజించడం వలన తమ కష్టాలు తీరతాయని భక్తుల నమ్మకం. అయితే హనుమంతుడుకి కూడా దేశంలో చార్ ధామ్ క్షేత్రాలను.. నిర్మించనున్నారు. ఆ క్షేత్రాల్లో భారీ ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించాడనున్నారు. అయితే ఈ నాలుగు హనుమాన్ క్షేత్రాల్లో ఇప్పటికే రెండు క్షేత్రాలు.. భారీ విగ్రహాలను ప్రతిష్టించారు. తాజాగా మరో హనుమాన్ భారీ విగ్రహాన్ని తమిళాడులో ప్రతిష్టించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది.
దేశంలోని ‘చార్ ధామ్’ (నాలుగు నివాసాలు లేదా పుణ్యక్షేత్రాలు) సిరీస్‌లో మూడవది అయిన 108 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని తమిళనాడులోని రామేశ్వరంలో శ్రీ హరీష్ చందర్ నందా ఎడ్యుకేషన్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతిష్టించనుంది. విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమాన్నిగత నెలలో నిర్వహించారు. మిగిలిన రెండు విగ్రహాలు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో ఉన్నాయి. నాల్గవ విగ్రహం కోసం స్థలాన్ని గుర్తించే యోచనలో ఉన్నారు. భారీ రాతి విగ్రహ నిర్మాణం ఈ నెలలో ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న.
Also Read: