స్పేస్ ఎక్స్ మార్స్ మిషన్… స్టార్ షిప్ క్రాష్ ల్యాండ్… అద్భుతమైన పరీక్షన్న శాస్త్రవేత్తల బృందం…

అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మిషన్ మార్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా డిసెంబర్ 9న స్పేస్ ఎక్స్ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్ షిప్‌ను టెస్ట్ లాంచ్ చేసింది.

స్పేస్ ఎక్స్ మార్స్ మిషన్... స్టార్ షిప్ క్రాష్ ల్యాండ్... అద్భుతమైన పరీక్షన్న శాస్త్రవేత్తల బృందం...
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2020 | 3:38 PM

SpaceX launches Starship on highest test flight, crash-lands  అమెరికా అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మిషన్ మార్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగా డిసెంబర్ 9న స్పేస్ ఎక్స్ హెవీ లిఫ్ట్ రాకెట్ స్టార్ షిప్‌ను టెస్ట్ లాంచ్ చేసింది. కానీ ఆ అంతరిక్ష నౌక ల్యాండ్ అవుతున్న సమయంలో పేలిపోయింది. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. కానీ, అద్భుతమైన పరీక్ష.. స్టార్‌షిప్‌ టీమ్‌కు ధన్యవాదాలు’ అంటూ ఆ సంస్థ మెసేజ్‌ చేసింది. ల్యాండింగ్‌ స్పీడ్‌ను పెంచడం వల్లే ఈ పేలుడు సంభంవించినట్లు సమాచారం. స్టార్‌ షిప్‌ కూలిపోయినప్పటికి మాకు అవసరమైన మొత్తం డాటా లభించింది! అభినందనలు స్పేస్‌ఎక్స్ బృందం” అని ఎలాన్‌ మస్క్‌ ట్వీట్ చేశారు

ఇంజన్ను పునః ప్రారంభించడంతో…

టెస్ట్ లాంచ్ ప్రారంభం అయిన తర్వాత స్టార్‌షిప్‌ కక్ష్యలోకి అధిరోహించింది, ఆ తర్వాత ఇంజన్లు బయటకు వచ్చాయి. స్టార్ షిప్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత మూడవ ఇంజిన్ ఆరిపోయింది. దీంతో అంతవరకు ఆపేసిన ఇంజన్లు పునః ప్రారంభించారు. దాంతో స్టార్ షిప్ కాస్తా భూమిపైకి దూసుకొచ్చి క్రాష్‌ ల్యాండ్ అయ్యింది.