కరోనా వార్డులో కుండపోతగా వర్షపు నీరు.. మండిపడుతోన్న విపక్షాలు..

గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వర్షాలతో కరోనా బాధితులు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో వర్షం నీరు భారీగా చేరుతోంది. తాజాగా ఓ ఆస్పత్రిలోని కరోనా వార్డులో కుండపోతగా..

కరోనా వార్డులో కుండపోతగా వర్షపు నీరు.. మండిపడుతోన్న విపక్షాలు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 11:48 AM

గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వర్షాలతో కరోనా బాధితులు మరింత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో వర్షం నీరు భారీగా చేరుతోంది. తాజాగా ఓ ఆస్పత్రిలోని కరోనా వార్డులో కుండపోతగా వర్షపు నీరు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ బరేలీలోని రాజ్ శ్రీ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. వర్షపు నీరు వెళ్లే పైపు పగలిపోవడంతో నీరు కోవిడ్ వార్డులోకి వచ్చినట్లు ఆస్పత్రి నిర్వాహకులు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయింది. రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతుందంటూ విపక్షాలు సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు ధ్వజమెత్తాయి. ఈ వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్వీట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.. యూపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ ఘటన పట్ల కరోనా బాధితులు, హెల్త్ వర్కర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. బరేలీలోని కోవిడ్ ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితి ఆందోళన కలిగిస్తుందని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More: మరో మంత్రికి కరోనా పాజిటివ్..