ట్రూకాలర్ వాడుతున్నారా.. అయితే మీ డేటా లీక్ అయినట్లే!

TrueCaller Indian Users, ట్రూకాలర్ వాడుతున్నారా.. అయితే మీ డేటా లీక్ అయినట్లే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ట్రూకాలర్ యూజర్ల డేటా లీకైంది. జస్ట్ రూ.1.5 లక్షలు చెల్లిస్తే చాలు ట్రూకాలర్ యూజర్ల డేటా డార్క్‌వెబ్‌లో దొరుకుతోందని ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ట్రూకాలర్ యూజర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ అడ్రస్.. ఇలా మొత్తం పలు రకాల డేటాను ఎవరైనా పొందొచ్చు. మరో షాకింగ్ విషయం ఏంటంటే లీకైన డేటాలో 60-70 శాతం భారతీయులదే అని అనుమానం. ఎందుకంటే ట్రూకాలర్‌ను అత్యధికంగా 14 కోట్ల మంది ఇండియన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఇండియన్ యూజర్ల డేటాకు రూ.1,55,000, గ్లోబల్ యూజర్ల డేటాకు రూ.20,00,000 చెల్లించి డార్క్‌వెబ్‌లో పొందవచ్చట.

కాగా ఈ విషయంపై ట్రూకాలర్ స్పందించింది. యూజర్ల డేటా లీక్ అంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. అయినా డేటా లీక్ వ్యవహారం సంచలనం సృష్టించడంతో క్షుణ్ణంగా విచారణ చేపట్టామని, అయితే డేటా లీకైనట్లు తమకు ఆధారాలేమీ లభించలేదన్నారు. యూజర్ల డేటాకు ముప్పు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని.. తమ సర్వర్లలో డేటా సురక్షితంగా ఉందన్నారు. అటు భారీ స్థాయిలో ట్రూకాలర్ యూజర్ల డేటా లీక్ అయిందని సైబర్ నిపుణులు మాత్రం నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *