Shruti Haasan : “అవును.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా”
ఒకప్పుడు సౌత్‌లో వరుస సినిమాలతో రచ్చ చేసింది లోకనాయకుడు కమల్ కుమార్తె శృతి హాసన్. అదోంటో గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పడు మళ్లీ వరుసగా మూవీస్‌కి సైన్ చేసి మరోసారి తాన్ రేస్‌లో ఉన్నానంటూ వార్నింగ్ సైన్స్ ఇచ్చింది. కాగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శృతి..ఇటీవల తన ఇన్‌స్టాలో తన రీసెంట్ పిక్స్ పోస్ట్ చేసింది. వాటికి నెటిజన్లు కొందరు వల్గర్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారికి సమాధానం చెప్తూ గాటుగా రెస్పాన్స్ ఇచ్చింది ఈ క్రేజీ హీరోయిన్.
Shruti Haasan : ఒకప్పుడు సౌత్‌లో వరుస సినిమాలతో రచ్చ చేసింది లోకనాయకుడు కమల్ కుమార్తె శృతి హాసన్. అదోంటో గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పడు మళ్లీ వరుసగా మూవీస్‌కి సైన్ చేసి మరోసారి తాను రేస్‌లో ఉన్నానంటూ వార్నింగ్ సైన్స్ ఇచ్చింది. కాగా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శృతి..ఇటీవల ఇన్‌స్టాలో తన రీసెంట్ పిక్స్ పోస్ట్ చేసింది. వాటికి నెటిజన్లు కొందరు వల్గర్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారికి సమాధానం చెప్తూ గాటుగా రెస్పాన్స్ ఇచ్చింది ఈ క్రేజీ హీరోయిన్.
“నా గత పోస్ట్‌కు సంబంధించి కొందిరికి సమాధానం చెప్పాలనిపించింది. నేను ఇతరులు అభిప్రాయాల ప్రకారం నడుచుకునే వ్యక్తిని కాదు. ‘శృతి అప్పుడు లావుగా ఉంది..ఇప్పుడు సన్నగా మారింది..ఎలా’ అంటూ ఎవరికి ఇష్టమొచ్చినా కామెంట్లు వారు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. గత పోస్ట్‌లో నేను పెట్టిన ఫోటోలు ఇటీవల రెండు, మూడు రోజుల వ్యవధిలో తీసినవి. ప్రతి మహిళా ఎదుర్కునే సమస్యనే నేను ప్రస్తావించబోతున్నా. హార్మోన్ల సమస్య కారణంగా శారీరకంగా, మానసికంగా నేను ఇబ్బందులకు గురవుతున్నా. ఆరోగ్యంగా ఉండేందుకు చాలా కష్టపడుతున్నా. కాని అది చిన్న విషయం కాదు. శరీక ఆకృతుల్లో మార్పులు వెనుక చాలా కష్టం ఉంటుంది. కానీ, నా విషయంలో జరిగింది చెప్పడం పెద్ద విషయం కాదు. ఒకరి స్థాయిని ఎవ్వరూ డిసైడ్ చెయ్యలేరు. ఇది నా జీవితం..ఇది నా ముఖం. అవును గతంలో ప్లాస్టిక్‌సర్జరీ చేయించుకున్నా. ఈ విషయాన్ని చెప్పడంలో నాకు పెద్ద ఇబ్బందేమీ లేదు. ఎలా జీవించాలో నాకు తెలుసు..అలాగే ఉంటా. ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం ఉత్తమమైన పని. ప్రస్తుతం నేను అదే ప్రయత్నిస్తున్నా. మీరు కూడా అలాగే ట్రై చెయ్యండి” అని శృతిహాసన్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ‘క్రాక్’లో హీరోయిన్గా నటిస్తోంది. తమిళంలో ‘దేవి’, ‘లాభం’ మూవీస్ చేస్తోంది.
ఇది కూడా చదవండి : ‘కేజీఎఫ్’ హీరో హత్యకు ప్లాన్ చేసిన రౌడీషీటర్ ఎన్కౌంటర్