నేటి నుంచి కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న శైవక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్దిగాంచిన కీసరగుట్ట (కేసరిగిరి)లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధానంగా ఈ నెల 4వ తేదీన జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివకల్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, జాగరణలు, సాంస్కృతిక, ఆధ్మాత్మిక వేడులన్నింటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు […]

నేటి నుంచి కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 10:42 AM

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న శైవక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్దిగాంచిన కీసరగుట్ట (కేసరిగిరి)లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధానంగా ఈ నెల 4వ తేదీన జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివకల్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, జాగరణలు, సాంస్కృతిక, ఆధ్మాత్మిక వేడులన్నింటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న కీసర శ్రీరామలింగేశ్వర స్వామి దర్శనానికి ఈ సారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, భక్తుల సౌకర్యార్థం కొండపై సకల వసతులు కల్పించామని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే భక్తులను ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.