ఒకే ఒక్క బంతి మొక్క 865 పూలు..లిమ్కా రికార్డ్ బ్రేక్‌

Plant Gives 865 Flowers Limca Book Record, ఒకే ఒక్క బంతి మొక్క 865 పూలు..లిమ్కా రికార్డ్ బ్రేక్‌

అది మొక్కేనా..లేక ఫ్లవర్‌ బొకేనా..అనిపించేలా విరగబూసింది ఓ బంతి మొక్క.  ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా వందల సంఖ్యలో పూలు పూసింది. ఇప్పటి వరకు మనం బంతిలో చాలా రకాలను చూశాం..ముద్దబంతి,రేక బంతి,ఊక బంతి, కృష్ణ బంతి ఇలా ఎన్నో రకాలు..మరెన్నో రంగులతో బంతి మొక్క అలరిస్తుంది. అయితే, ఒకే మొక్క వందల సంఖ్యలో పూలు పూయటం ఎప్పుడూ చూడలేదు..కానీ, ఒక్క బంతి మొక్కతో ఓ సైంటిస్ట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు.

Plant Gives 865 Flowers Limca Book Record, ఒకే ఒక్క బంతి మొక్క 865 పూలు..లిమ్కా రికార్డ్ బ్రేక్‌
చంబాఘాట్‌కు చెందిన కుంభ్ అనుసంధాన్ శాస్త్రవేత్త డాక్టర్ బ్రజ్ లాల్ అత్రీ ఓ బంతి మొక్కతో 865 పూలు పూయించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సాధించారు. డాక్టర్ అత్రీ 2015 నుండి బంతి మొక్కలకు భారీ సంఖ్యలో పూలు పూయించేందుకు ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు విజయం సాధించి లిమ్కా బుక్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఉత్తరాఖండ్ ముక్తేశ్వర్ నైనితాల్ లో తాను పెంచిన మొక్కకు సంబంధించిన వివరాలకు లిమ్కా బుక్ ప్రతినిధులకు పంపించగా ప్రతినిథులు మొక్కను పరిశీలించి ఇప్పటివరకు 865 పూలు పూయటం రికార్డు లేదని డాక్టర్ అత్రికి రికార్డు సర్టిఫికెట్ ను ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *