యూఎస్ లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కి తీవ్రమైన అలెర్జీ, బ్రిటన్ తరహాలోనే !

అమెరికాలోని అలాస్కాలో ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థల కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెల్త్ వర్కర్ కి తీవ్రమైన అలెర్జీ సోకింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

యూఎస్ లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ కి తీవ్రమైన అలెర్జీ, బ్రిటన్ తరహాలోనే !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2020 | 10:42 AM

అమెరికాలోని అలాస్కాలో ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థల కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ హెల్త్ వర్కర్ కి తీవ్రమైన అలెర్జీ సోకింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ టీకామందు తీసుకున్న వెంటనే అతనికి అలెర్జీ వచ్చిందని, బ్రిటన్ లో గతవారం జరిగిన రెండు కేసుల వంటిదే ఇది కూడానని వారు  చెప్పారు. ఓ మందు, లేదా ఆహారం ఒంటికి పడని వారు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండడమే మంచిదని బ్రిటన్ లోని రెగ్యులేటరీ సంస్థలు ఇటీవలే హెచ్చరించాయి కూడా.. కానీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం తమ దేశంలో చాలామందికి అలెర్జీ ఉన్నప్పటికీ ఫైజర్, బయో ఎన్ టెక్ టీకామందు తీసుకున్నా సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. తీవ్రమైన అలెర్జీలతో బాధ పడేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోరాదని మాత్రం ఈ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.

కాగా ఈ హెల్త్ వర్కర్ కి గతంలో ఈ రుగ్మత ఉన్న దాఖలాలు లేవని ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ లిండే జోన్స్ తెలిపారు. అతని హెల్త్ కు సంబంధించిన రికార్డులను తాము గమనించామన్నారు. ప్రస్తుతం ఈ రోగి ఇంకా ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నాడు. సోమవారం నుంచి అమెరికాలో కోవిడ్ 19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించారు. అటు- తమ టీకామందు తీసుకున్నవారు,ముఖ్యంగా అలెర్జీ ఉన్నవారు కొంతకాలం వైద్యుల పర్యవేక్షణలో ఉంటే మంచిదని ఫైజర్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎప్పటికప్పుడు తాము తగిన జాగ్రత్తలను సూచిస్తూ ఉంటామని, అనుభవజ్ఞులైన రీసెర్చర్ల పరిశోధనలతోనే తాము ఈ టీకామందు ఉత్పత్తి చేస్తున్నామని ఈ సంస్థ వెల్లడించింది.

10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..