దూసుకుపోయిన సెన్సెక్స్‌.. 31వేల పైకి..

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. అయితే దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

దూసుకుపోయిన సెన్సెక్స్‌.. 31వేల పైకి..
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 5:18 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. అయితే దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కరోనా కారణంగా మరింత కాలం లాక్‌డౌన్‌ విధించొచ్చన్న వార్తలతో నిన్న నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ముగించడం గమనార్హం. మరింత కాలం లాక్‌డౌన్‌ పొడిగిస్తే ఆయా ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సహా భారత మార్కెట్లు లాభాలతో ముగిశాయి. కేంద్రం సైతం రెండో ప్యాకేజీకి సిద్ధమవుతోందన్న వార్తలు కలిసొచ్చాయి.

కాగా.. సెన్సెక్స్‌ 1265.66 పాయింట్లు లాభపడి 31,159.62 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 3563.15 పాయింట్లు లాభపడి 9,111.90 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.42గా ఉంది. ఫైనాన్షియల్‌, ఆటోమొబైల్‌, ఫార్మా షేర్లు రాణించాయి. నిఫ్టీలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, సిప్లా, టైటాన్‌ కంపెనీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి. రేపు (ఏప్రిల్‌ 10న) గుడ్‌ఫ్రై కారణంగా మార్కెట్లు పనిచేయవు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో