Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • ప్రధానితో సమావేశమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లాక్ డౌన్ కొనసాగించే అంశంపై కీలక చర్చ. నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన హోంమంత్రి అమిత్ షా. ముఖ్యమంత్రులు అభిప్రాయాలను ప్రధానితో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించిన కేంద్ర హోం శాఖ.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

బడ్జెట్ సమావేశాలు: రాజధాని పరిసరాల్లో సెక్షన్ 30 అమలు

AP Assembly Session 2019, బడ్జెట్ సమావేశాలు: రాజధాని పరిసరాల్లో సెక్షన్ 30 అమలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో సెక్షన్ 30 అమలు చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి కార్యక్రమాలైనా ధర్నా చౌక్‌లోనే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, ఆందోళనలకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు సచివాలయం మొదటి బ్లాక్‌లో ఏపీ కేబినెట్ మీటింగ్ జరగనుంది. అందులో బడ్జెట్‌ను లాంఛనంగా ఆమోదించనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లులపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ ప్రవేశం తరువాత సభలను సోమవారానికి వాయిదా వేయనున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నవరత్నాల రూపకల్పన.. ముఖ్యంగా రైతులకు మేలు కలిగేలా ఈ బడ్జెట్ ఉండబోతుందని పలువురు భావిస్తున్నారు. మరి వారి అంచనాలను ఈ బడ్జెట్ ఏమాత్రం అందుకుంటుందో చూడాలి.

Related Tags