గాన గంధర్వుడి సైకత శిల్పం

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలు భౌతిక కాయానికి అంజలి ఘటించి అశ్రు నివాళులు అర్పించారు.

గాన గంధర్వుడి సైకత శిల్పం
Follow us

|

Updated on: Sep 26, 2020 | 1:14 PM

తన అద్భుత గాత్రంతో భారతీయ పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్న శ్రీప‌తి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం ఇకలేరని తెలుసుకున్న యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కరోనా వైరస్ బారిన పడి ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు 50 రోజుల పాటు చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలుపుతూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

పూరికి చెందిన ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఎస్సీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులర్పించారు. ఒడిశాలోని పూరి సముద్రతీరంలో బాలు చిత్రాన్ని ఇసుకతో చిత్రించి అంజలి ఘటించారు. సాగర తీరంలో బాలు సైకత శిల్పం ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలు భౌతిక కాయానికి అంజలి ఘటించి అశ్రు నివాళులు అర్పించారు. చెన్నై శివారులోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలు అంతిమ సంస్కారాలు తమిళనాడు ప్రభుత్వం లాంఛనాలతో జరిగాయి. బాలు కుమారుడు చరణ్‌, కుటుంబ సభ్యులు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బాలూకు కన్నీటి వీడ్కోలు పలికారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో