జాతి వివక్ష: సారీ చెప్పిన ఇషాంత్ శర్మ

టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ తనకు సారీ చెప్పినట్లుగావెస్టిండీస్‌ క్రికెటర్‌ డారెన్‌ సామి తెలిపారు. అతడు దురుద్దేశంతో అలా సంబోధించి ఉండకపోయి వుండవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. క్రికెట్లో మాత్రం జాతి వివక్షకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక జాతి వివక్షపై యుద్ధం సాగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దిగివస్తున్నాయి. తమ ప్రకటనలను సైతం మార్చుకుంటున్నాయి. అమెరికాలోని ఓ పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి […]

జాతి వివక్ష: సారీ చెప్పిన ఇషాంత్ శర్మ
Follow us

|

Updated on: Jul 02, 2020 | 5:01 AM

టీమిండియా క్రికెటర్ ఇషాంత్ శర్మ తనకు సారీ చెప్పినట్లుగావెస్టిండీస్‌ క్రికెటర్‌ డారెన్‌ సామి తెలిపారు. అతడు దురుద్దేశంతో అలా సంబోధించి ఉండకపోయి వుండవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. క్రికెట్లో మాత్రం జాతి వివక్షకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.

ఇక జాతి వివక్షపై యుద్ధం సాగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దిగివస్తున్నాయి. తమ ప్రకటనలను సైతం మార్చుకుంటున్నాయి. అమెరికాలోని ఓ పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి మెడపై కాలు అదిమిపెట్టడంతో అతడు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ‘నల్ల జాతీయుల ప్రాణాలూ విలువైనవే’ #BlackLivesMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు జోరుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని డారెస్‌ సామి ఆరోపించారు. తనకు జరిగిన సంఘటనను ఎత్తి చూపించారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు కొందరు తనను ‘కాలూ’ అని పిలిచారని చెప్పాడు. ఇషాంత్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సామిని ‘కాలూ’అంటూ చేసిన పోస్ట్‌ను చూపాడు.

అయితే ఈ అంశంపై ఇషాంత్‌ తనకు ఫోన్ చేసి వివరించినట్లుగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఇంతటితో ఎండ్ కార్డ్ వేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే.. ఇషాంత్‌పై తనకు ఆగ్రహం లేదని, మళ్లీ కలిసినప్పుడు మనసారా కౌగిలించుకుంటానని పేర్కొన్నారు సామి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు