సమంత ‘ఓ బేబీ’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!

‘మజిలీ’తో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ సమంత చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓ బేబీ’. రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను వివరీతంగా ఆకట్టుకుంది. 70 సంవత్సరాల మహిళ 20 ఏళ్ల యువతిగా మారితే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమా నేపధ్యమని తెలుస్తోంది. కొరియన్ డ్రామా ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. కాగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *