బెంగళూరుపై కోల్‌కతా అనూహ్య విజయం

బెంగళూరు: గెలుపు కోసం ఎదురు చూస్తున్న ఆర్‌సీ‌బీ నిరీక్షణ ఫలించలేదు. ఈ సీజన్‌లో కోహ్లీ సేన వరుసగా ఐదో ఓటమి చవి చూసింది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు పరాజయం పాలైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రూ రసెల్‌ (48 నాటౌట్‌; 13 బంతుల్లో 1×4, 7×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. కోల్‌కతా జట్టు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ […]

బెంగళూరుపై కోల్‌కతా అనూహ్య విజయం
Follow us

|

Updated on: Apr 06, 2019 | 2:22 PM

బెంగళూరు: గెలుపు కోసం ఎదురు చూస్తున్న ఆర్‌సీ‌బీ నిరీక్షణ ఫలించలేదు. ఈ సీజన్‌లో కోహ్లీ సేన వరుసగా ఐదో ఓటమి చవి చూసింది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు పరాజయం పాలైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రూ రసెల్‌ (48 నాటౌట్‌; 13 బంతుల్లో 1×4, 7×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో.. కోల్‌కతా జట్టు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టు.. కెప్టెన్ విరాట్ కోహ్లి (84; 49 బంతుల్లో 9×4, 2×6), డివిలియర్స్‌ (63; 32 బంతుల్లో 5×4, 4×6), స్టాయినిస్‌ (28 నాటౌట్‌; 13 బంతుల్లో 3×4, 1×6) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.