Breaking News
  • ఢిల్లీ: మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా ప్రభావం. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు. అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం నిర్ణయం.
  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర కారు బీభత్సం. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా, యువకుడికి గాయాలు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కారులో మద్యం బాటిల్‌ లభ్యం. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32కు చేరిన కరోనా కేసులు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పరిధిలో 12 హాట్‌స్పాట్స్. లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు. వేర్వేరు దేశాల నుంచి ట్రావెల్ చేసిన.. 814 మందికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో 246 మంది అనుమానితులు. ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డులో 11 మంది అనుమానితులు.
  • కరోనా కట్టడి కోసం పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు. పీఎం కేర్స్‌కు రూ.52 కోట్ల విరాళం ఇచ్చిన 12 ప్రధాననౌకాశ్రయాలు.. షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు.
  • ఏపీలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. విశాఖ, గుంటూరు, కడపలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి 240 పరికరాలు. కొవిడ్‌-19పై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి.

సోషల్ మీడియాకు ఇక ‘ కళ్లెం ‘ .. ‘ నా ఇష్టం అంటే కుదరదు ‘..

The government said rules to regulate social media will be Finalised, సోషల్ మీడియాకు ఇక ‘ కళ్లెం ‘ .. ‘ నా ఇష్టం అంటే కుదరదు ‘..

 

సోషల్ మీడియాకు ఇక ‘ బ్రేకులు ‘ పడనున్నాయి. ‘ నా ఇష్టం ‘ అంటూ ఈ మీడియాలో చెలరేగేవారికి ఇదో చేదు వార్త. సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సి ఉందని భావిస్తున్న కేంద్రం మరో మూడు నెలల్లో విధివిధానాలను రూపొందించబోతోంది. ఈ మాధ్యమాల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలను, , ఫేక్ (తప్పుడు) వార్తలు, పరువు ప్రతిష్టలను దిగజార్చే పోస్టింగులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు రానున్నాయి. జనవరి 15 లోగా ఇవి ఖరారు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం మంగళవారం ఈ సరికొత్త విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. కాగా-మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో పెండింగులో ఉన్న అన్ని కేసులనూ అత్యున్నత న్యాయస్థానం తనంతట తానూ బదిలీ చేసుకుంది. జనవరి చివరివారంలో ఈ కేసులపై విచారణ జరపనుంది. ఫేస్ బుక్, వాట్సాప్ తమ కేసులను ఈ కోర్టుల నుంచి అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరుతూ వస్తున్నాయి. హైకోర్టుల్లో వీటిపై విచారణ జరిగితే అది దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపవచ్ఛునని ఈ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేసేందుకు ఈ సంస్థలు చేసిన ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకూ నిలువరిస్తూ వచ్చింది. విశ్లేషణ కోసం ప్రభుత్వం కోరే ఏ సమాచారాన్ని అయినా వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు డీక్రిప్ట్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం తరఫు లాయర్, అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ అభ్యర్థించారు. ఈ సంస్థలు ఇండియాకు వచ్చాక.. తాము సమాచారాన్ని డీక్రిప్ట్ చేయలేమని అంటున్నాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. (ఇది ఈ కేసును సుప్రీంకోర్టుకు బదలాయించేందుకు తమిళనాడు అంగీకరించకముందు జరిగిన వాదన). అయితే సమాచారాన్ని డీక్రిప్ట్ చేసే ‘ కీ ‘ తమవద్ద లేదని అధికారులతో తాము సహకరించడం మాత్రమే చేయగల్గుతామని ఈ సంస్థలు పేర్కొన్నాయి. ఈ దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ బోస్ చమత్కారంగా ఓ వ్యాఖ్య చేశారు. ‘ ప్రభుత్వం ఓ ఇంటి యజమాని నుంచి కీ (తాళం) కోరుతోందని, కానీ ఆ యజమాని తన వద్ద అది లేదని అంటున్నాడని ‘ వారు అన్నారు.
అటు-కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సోషల్ మీడియాకు నిబంధనలు ఖరారు చేయాలన్న ప్రతిపాదన ప్రజల ప్రయివసికి భంగం కల్గించాలన్న కుట్ర కాదని, దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాలన్నదేననీ స్పష్టం చేశారు.

Related Tags