ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ‘అల’.. అసలేమైంది..?

త్రివిక్రమ్, అల్లు అర్జున్… క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురంలో’పై ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు, పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకోవడంతో… బన్నీకి ఈ సారి హిట్ గ్యారెంటీ అన్న టాక్ ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై పలు నెగిటివ్ టాక్‌లు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ కథను 1958లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఇంటి గుట్టు’ నుంచి తీసుకున్నారన్న టాక్ ఆ మధ్య వినిపించింది. […]

ఆ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన 'అల'.. అసలేమైంది..?
Follow us

| Edited By:

Updated on: Dec 18, 2019 | 3:12 PM

త్రివిక్రమ్, అల్లు అర్జున్… క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురంలో’పై ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు, పాటలు అందరినీ విపరీతంగా ఆకట్టుకోవడంతో… బన్నీకి ఈ సారి హిట్ గ్యారెంటీ అన్న టాక్ ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై పలు నెగిటివ్ టాక్‌లు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ కథను 1958లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఇంటి గుట్టు’ నుంచి తీసుకున్నారన్న టాక్ ఆ మధ్య వినిపించింది. అంతేకాదు ఈ కథ ‘నేను శైలజ’ను పోలీ ఉందన్న రూమర్లు వినిపించాయి(అయితే దీనిని నిర్మాతలు ఖండించారు). దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌లో కొన్ని సీన్లను త్రివిక్రమ్ పక్క సినిమాల నుంచి కాపీ కొట్టాడన్న కామెంట్లు హల్‌చల్ చేశాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో టాక్ టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీ విషయంలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు త్రివిక్రమ్‌కు గొడవ జరిగిందట. మూవీ రన్‌ టైమ్ విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మూవీ రన్‌ టైమ్‌‌ను మూడు గంటలు ఫిక్స్ చేయాలని త్రివిక్రమ్ అనుకున్నారట. అంతేకాదు దీనికి ఓ పాటను కూడా జోడించాలని ఆయన భావించారట. కానీ అల్లు అరవింద్ మాత్రం 2.30 గంటలు చాలని పట్టుపడ్డారట. రన్ టైమ్ ఎక్కువ ఉన్నా.. సినిమా ఫలితంపై అది ప్రభావం చూపే అవకాశం ఉందన్న భావనతో దీనికి మెగా ప్రొడ్యూసర్ ససేమిరా అన్నారట. దీంతో ఆయనను ఒప్పించేందుకు త్రివిక్రమ్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని.. చివరకు కాస్త వెనక్కి తగ్గిన మాటల మాంత్రికుడు.. నిడివిని గం.2.45ని.లకు(పాటతో సహా) ఫైనల్ చేశాడని టాక్ వినిపిస్తోంది. మరి అసలు ఈ సినిమా ఎంత సేపు ఉండబోతుంది తేలాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే రెండోసారి జత కట్టబోతోంది. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో