“రియల్‌ మీ’..నాలుగు కెమెరాలతో సరికొత్తగా..

Realme 5 Pro review: Best of Realme 3 Pro with more cameras, “రియల్‌ మీ’..నాలుగు కెమెరాలతో సరికొత్తగా..

నాలుగు కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం క్వాడ్‌ క్యామ్‌ ఫోన్ల ట్రెండ్‌ నడుస్తోంది. నిలువుగా నాలుగు కెమెరాలతో అద్భుతమైన ఫోటోలు, ఫోటో ఎడిటింగ్‌ సదుపాయాలనీ అందించే ఈ క్వాడ్‌ క్యామ్‌ ఫీచర్స్‌ని అందించేందుకుగానూ, Realme 5, Realme 5 Pro భారతదేశంలో కొత్త చిప్‌సెట్‌లు ప్రారంభించబడ్డాయి.
5 ప్రో గత వెర్షన్‌ 5 కంటే బెటర్‌ ర్యామ్‌, మోర్‌ స్టోరేజ్‌‌తో ఆకర్షణీయంగా అనిపిస్తోంది. రియల్‌ మీ ఖరీదు 10వేలు కాగా, ఈ ప్రో వెర్షన్‌ 14 వేల రూపాయల్లో లభించబోతోంది. ర్యామ్‌,స్టోరేజ్‌ని బట్టి రేట్లలో వేరియేషన్‌ ఉంది. రియల్‌ మీ 5 ప్రో బ్యాటరీ కెపాసిటీ 4035 ఎంఎహెచ్‌ కాగా – దీంట్లో వూక్‌ (Vooc ) ఛార్జింగ్‌ 3.0 ఫెసిలిటీ వల్ల ఈ ఫోన్‌ ని అత్యంత వేగంగాఛార్జ్‌ చేసుకోవచ్చు.
రియల్‌ మీ 5 ప్రో ధరలు ఇలా :
4జీబీ/64 జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించింది. ఇక 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధరరూ.16,999 మాత్రమే.
రియల్‌ మీ 5 ప్రో స్పెసిఫికేషన్లు:
6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, రిజల్యూషన్ 2340 x 1080 పిక్సెల్స్, 48ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4035ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్‌డీఎం 712 ఆక్టాకోర్ 2.3 జీహెచ్‌జడ్ ప్రాసెసర్, వూక్ చార్జింగ్, వెనకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇది మెరిసే బ్లూ మరియుక్రిస్టల్ గ్రీన్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *