చెర్రీ న్యూ లుక్ చూశారా..

Ram Charan New Look Viral : కరోనా వ్యాప్తి కారణంగా సినిమా ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ ప్రభావంతో సినిమా షూటింగ్‌లు నిలిచి పోవడంతో తమకు నచ్చిన పనుల్లో బిజీగా మారుతున్నారు. కొందరు ఫిట్ నెస్‌పై దృష్టి పెడితే.. మరికొందరు ఆగ్రో ఫామింగ్ నేర్చుకుంటున్నారు. ఈ మూడు నెలల కాలంలో ఎటువంటి షెడ్యూల్స్ లేక పోవడంతో స్పెషల్ లుక్‌తో కనిపిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు ఫుల్ హెయిర్ స్టైల్‌తో లుక్‌ను మార్చేశారు. ఇక మెగాపవర్ స్టార్ […]

  • Sanjay Kasula
  • Publish Date - 3:27 pm, Fri, 3 July 20

Ram Charan New Look Viral : కరోనా వ్యాప్తి కారణంగా సినిమా ప్రముఖులు ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ ప్రభావంతో సినిమా షూటింగ్‌లు నిలిచి పోవడంతో తమకు నచ్చిన పనుల్లో బిజీగా మారుతున్నారు. కొందరు ఫిట్ నెస్‌పై దృష్టి పెడితే.. మరికొందరు ఆగ్రో ఫామింగ్ నేర్చుకుంటున్నారు. ఈ మూడు నెలల కాలంలో ఎటువంటి షెడ్యూల్స్ లేక పోవడంతో స్పెషల్ లుక్‌తో కనిపిస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు ఫుల్ హెయిర్ స్టైల్‌తో లుక్‌ను మార్చేశారు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా ఉన్నారో చూస్తే షాక్‌కు గురికావడం ఖాయం. ఫుల్ హెయిర్ కట్‌తో అదరగొడుతున్నారు.

ప్రస్తుతం చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించి ఓ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో చరణ్ కండలతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న ఓ వీడియోని జానీ మాస్టర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.