సోదరీ సోదరుల బంధమే కాదు..చెడు నుంచి రక్షణే ఈ రక్షా బంధన్

అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. సోదరుడి చేతికి రాఖీ కట్టి..తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. అలాగే తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేలా వాళ్లిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధాన్ని రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. అందుకే దీన్ని రక్షాబంధన్ అని పిలుస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. […]

సోదరీ సోదరుల బంధమే కాదు..చెడు నుంచి రక్షణే ఈ రక్షా బంధన్
Follow us

|

Updated on: Aug 15, 2019 | 8:01 AM

అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. సోదరుడి చేతికి రాఖీ కట్టి..తను పది కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. అలాగే తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేలా వాళ్లిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధాన్ని రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. అందుకే దీన్ని రక్షాబంధన్ అని పిలుస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమి రోజు జరుపుకునే రాఖీ పండుగకు ఎంతో విశిష్టత ఉంది.

కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. కానీ ఇప్పుడు దేశమంతా చాలా ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు. అన్నా చెల్లెళ్లు..అక్కా తమ్ముళ్లు తెగ ఆనందిస్తారు. ఎందుకంటే ఇది సోదర సోదరీమణుల మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తుంది. ఐతే ఈ రాఖీ పండుగ ఎక్కడి నుంచి వచ్చింది. అంటే దానికి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోతున్న దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి..శ్రావణ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి దేవేంద్రుడి చేతికి రక్షను కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. ఆ పవిత్రదారం చెడు నుంచి రక్షణగా మారిందని శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా జరుపుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి.

బలి చక్రవర్తి. విష్ణువు భక్తుడు. ఆయనపై ఉన్న విపరీతమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకుంటాడు బలి చక్రవర్తి.  దీంతో లక్ష్మీదేవి తన భర్తను ఎలాగైనా వైకుంఠానికి తిరిగి తీసుకురావాలని బలిచక్రవర్తికి రక్షాబంధన్ కడుతుంది. దీంతో కరిగిపోయిన బలి చక్రవర్తి విష్ణుమూర్తిని తన వెంట తీసుకెళ్లాలని చెబుతాడు. అలా రక్షాబంధన్ వెలుగులోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతారు. బలిచక్రవర్తి భక్తి అనే అర్థం వచ్చేలా రాఖీని బలేవా అని కూడా పిలుస్తారు.

ఇక ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీ కృష్ణుల అనుబంధం ఎంతో అద్భుతంగా ఉంటుంది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని విసిరినప్పుడు శ్రీకృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుందట. వెంటనే ద్రౌపది తన పట్టుచీరను చింపి రక్తస్రావం రాకుండా కృష్ణుని వేలికి చుడుతుంది. అందుకు కృతజ్ఞతగా దుశ్శాసనుడి దురాగతం నుంచి ఆమెను కాపాడుతాడు శ్రీ కృష్ణుడు. వీరిరువురి ప్రేమకు చిహ్నంగా రాఖీ పండుగ జరుపుకుంటారని ప్రచారంలో ఉంది.

క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపై దాడి చేసిన సమయంలో అతని భార్య రోక్సానా.. తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. తన భర్తను చంపవద్దని పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ ను చంపకుండా విడిచిపెడతాడు. ఆ సోదర బంధమే అలెగ్జాండర్ పై దాడి చేయకుండా అడ్డుకుందని ప్రచారంలో ఉంది.

మహాభారత యుద్ధంలో కుంతి రాణి తన మనవడు అభిమన్యు – సుభద్ర మరియు అర్జున్ కుమారుడు – మణికట్టు మీద పవిత్రమైన దారాన్ని కట్టుకున్నట్లు చెబుతారు.

గణేశుడు తన సోదరితో కలిసి రాఖీని జరుపుకోవడం చూసి, అతని కుమారులు శుభ్ మరియు లాబ్ కూడా తన సోదరైన సంతోషి మా తో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారని ప్రచారంలో ఉంది.

ఇక చిత్తూరు వితంతువు రాణి కర్నావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ కు రాఖీని పంపినట్లు చెబుతారు. హుమాయూన్ ఆలస్యంగా మారినప్పటికీ..రాఖీ సెంటిమెంట్ ను గౌరవించాడని చెబుతారు.  రాఖీ అంటే కేవలం సోదరుల మధ్య ఉండే అనురాగ బంధమే కాదు. చెడు నుంచి రక్షణగా ఈ రక్ష కడతారని..అందుకే రక్షాబంధన్ జరుపుకుంటారని ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో