బీజేపీ వ్యవస్థాపకుడు అద్వానీని అరెస్ట్ చేసి.. నేడు కేంద్రమంత్రిగా..

గతంలో బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీని అరెస్ట్ చేసిన ఐఏఎస్ అధికారి రాజ్ కుమార్ సింగ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన చేత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖా కార్యదర్శిగా పని చేసిన ఆయన బీహార్‌లోకి ఎల్.కే అద్వానీ రథయాత్ర ప్రవేశించినప్పుడు అప్పటి  సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాలతో ఆ రథయాత్రను అడ్డుకోవడమే కాకుండా అద్వానీని అరెస్ట్ చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలమైంది. అంతేకాకుండా బీహార్ రాష్ట్రంలో అత్యంత సమర్థవంతమైన ఐఏయస్ అధికారిగా ఈయన మంచిపేరు కూడా తెచ్చుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *