సీఎం మమతా బెనర్జీపై రాహుల్ గాంధీ ఫైర్

మాల్దా : పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీపై తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. దీదీ పాలనను వన్ మ్యాన్ షోగా అభివర్ణించారు.శనివారం మాల్దా(ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్‌ మాట్లాడారు. తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని ఆమె పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. మమత ఎవరినీ సంప్రదించరని, ఎవరి సలహాలను కూడా తీసుకోరని.. తనకు నచ్చిందే ఆమె చేస్తారని ఎద్దేవాచేశారు. ప్రధాని నరేంద్రమోదీ, మమత పాలనను పోలుస్తూ వ్యంగ్యాస్ర్తలు సంధించారు. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పనితీరు […]

సీఎం మమతా బెనర్జీపై రాహుల్ గాంధీ ఫైర్
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2019 | 12:49 PM

మాల్దా : పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీపై తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. దీదీ పాలనను వన్ మ్యాన్ షోగా అభివర్ణించారు.శనివారం మాల్దా(ఉత్తర) లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్‌ మాట్లాడారు. తన ఇష్టానుసారం రాష్ట్రాన్ని ఆమె పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. మమత ఎవరినీ సంప్రదించరని, ఎవరి సలహాలను కూడా తీసుకోరని.. తనకు నచ్చిందే ఆమె చేస్తారని ఎద్దేవాచేశారు. ప్రధాని నరేంద్రమోదీ, మమత పాలనను పోలుస్తూ వ్యంగ్యాస్ర్తలు సంధించారు. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ పనితీరు ఒకేలా ఉంటుంది. వారిద్దరూ ఎవరినీ సంప్రదించకుండానే తమ ప్రభుత్వాలు నడుపుతున్నారు. ప్రజలను పూర్తిగా విస్మరించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు అని విమర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు. గత కమ్యూనిస్టుల పాలనకు టీఎంసీ పాలనకు తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలో మార్పేమీ లేదు. ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. మమత పాలన అధ్వానం. ఆమెకు మినహా మరొకరు బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేదు. ప్రజలకిచ్చిన హామీల అమలులో మమత విఫలమయ్యారు అంటూ విమర్శించారు.