గణతంత్ర వేడుకల్లో వర్టికల్ చార్లీ విన్యాసాలు.. స్పెషల్‌ అట్రాక్షన్‌‌గా రఫేల్‌ జెట్‌ ఫైటర్స్

భారత అమ్ములపొదిలో బ్రహ్మస్త్రాలుగా అమరిన యుద్ధ విమానాలు.. గణతంత్ర వేడుకల్లో విన్యాసాలు చేయబోతున్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్‌ వేడుకల్లో రఫేల్‌ జెట్‌ ఫైటర్ స్పెషల్‌ అట్రాక్షన్‌ కాబోతోంది‌.

గణతంత్ర వేడుకల్లో వర్టికల్ చార్లీ విన్యాసాలు.. స్పెషల్‌ అట్రాక్షన్‌‌గా రఫేల్‌ జెట్‌ ఫైటర్స్
Follow us

|

Updated on: Jan 19, 2021 | 6:02 AM

Vertical Charlie : భారత అమ్ములపొదిలో బ్రహ్మస్త్రాలుగా అమరిన యుద్ధ విమానాలు.. గణతంత్ర వేడుకల్లో విన్యాసాలు చేయబోతున్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్‌ వేడుకల్లో రఫేల్‌ జెట్‌ ఫైటర్ స్పెషల్‌ అట్రాక్షన్‌ నిలవబోతోంది‌. రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వర్టికల్‌ చార్లీని విన్యాసాలకు సిద్ధంచేస్తున్నారు. 38 ఐఎఎఫ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు ఇండియన్‌ ఆర్మీ విమానాలు పాల్గొనే రిపబ్లిక్‌ డే విన్యాసాల్లో.. రఫేల్‌ ప్రత్యేకంగా అలరించబోతోంది.

వర్టికల్‌ చార్లీ విన్యాసాల్లో భాగంగా రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మొదట తక్కువ ఎత్తులో ఎగురుతూ… ఆ తర్వాత నిలువుగా తన చుట్టూ తాను తిరుగుతూ పైకి దూసుకెళ్తుంది. సాధారణంగా ముందుకు దూసుకెళ్లే విమానాలు… తమ గమనానికి భిన్నంగా నిట్టనిలువుగా ఆకాశంలోకి దూసుకెళ్లడాన్నే వర్టికల్ చార్లీ విన్యాసం అంటారు.

వర్టికల్ చార్లీ విన్యాసాల్లో ఒక రఫేల్ విమానం పాల్గొంటుందని వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది వెల్లడించారు. ఈ క్రమంలో జెట్‌ ఫైటర్‌ మెలికలు తిరుగుతూ అగ్నికీలలు విరజిమ్ముతుంది. 2016లో ఫ్రాన్స్‌నుంచి 26 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌ ఒప్పందం చేసుకుంది.

తొలివిడతలో భాగంగా ఐదు రఫేల్‌ జెట్స్‌ పోయినేడాది భారత్‌కు చేరుకున్నాయి. సెప్టెంబరు 10న ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు. ఈమధ్య ఈ యుద్ధ విమానాలను చైనా సరిహద్దుకు తరలించారు