కరోనా ఎఫెక్ట్: క్వాంటాస్ ఎయిర్‌వేస్‌లో 6వేల మందికి ఉద్వాసన..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా ప్రభావం వల్ల వచ్చే ఏడాది వరకు అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించే అవకాశం లేదని ఆస్ట్రేలియా అధికారులు చెప్పడంతో

కరోనా ఎఫెక్ట్: క్వాంటాస్ ఎయిర్‌వేస్‌లో 6వేల మందికి ఉద్వాసన..!
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 8:38 AM

Qantas airways: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా ప్రభావం వల్ల వచ్చే ఏడాది వరకు అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించే అవకాశం లేదని ఆస్ట్రేలియా అధికారులు చెప్పడంతో క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ తన ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. కరోనా ప్రభావం వల్ల తమ వైమానిక సంస్థకు చెందిన 100 విమానాలను 12 నెలల వరకు నడపలేమని, దీనివల్ల ఆదాయం తక్కువగా ఉన్నపుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని క్వాంటాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జాయిస్ తెలిపారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలతోపాటు ఆస్ట్రేలియా కూడా తమ దేశ సరిహద్దులను మూసివేసిన తర్వాత క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ తీవ్ర నష్టాలను చవిచూసింది. విద్యార్థుల కోసం ప్రయాణ నిబంధనలను సడలించినా, వచ్చే ఏడాది వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపే అవకాశం లేదని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు. తమ సంస్థలో ఉన్న 29వేల మంది ఉద్యోగుల్లో 6వేల మందిని తొలగిస్తున్నామని, మరో 15వేల మంది సేవలు తాత్కాలికంగా నిలిపివేసి, అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించగానే వారిని విధుల్లోకి తీసుకుంటామని క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది.

Also Read: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్ని ప్రమాదం