అప్పట్లో పూరి జగన్నాథ్ పెళ్లికి హెల్ప్ చేసిన ఇప్పటి స్టార్ నటీమణులు ఎవరంటే?

Puri Jagannadh Opens Up About His Love Story and Marriage, అప్పట్లో పూరి జగన్నాథ్ పెళ్లికి హెల్ప్ చేసిన ఇప్పటి స్టార్ నటీమణులు ఎవరంటే?

ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ ఇప్పటికే 12 రోజుల్లో 32 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మాస్ స్టామినా ఏంటో చూపిస్తుంది. కాగా ఇటీవల జరిగిన టీవీ9 దిల్ సే ప్రొగ్రాంలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు పూరి.

ఈ ఏస్ డైరక్టర్ పెళ్లి సినిమా స్టైల్‌లో జరిగిందంట. నిన్నే పెళ్లాడతా సినిమాకు డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సమయంలోనే తన మ్యారేజ్ జరిగిందని..  అప్పటికి తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని.. కానీ స్నేహితులే దగ్గరుండి గుడిలో పెళ్లి చేశారని చెప్పుకొచ్చారు పూరి.  యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు కొనిచ్చిందని.. ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకొచ్చిందని చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని చెప్పాడు ఈ ఎవర్‌గ్రీన్ దర్శకుడు. పెళ్లి బట్టలు కట్టుకుని తాళి బొట్టు కట్టేసి కూల్ డ్రింక్ తాగేసి  మళ్లీ షూటింగ్ వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు. ఇక పూరి జగన్నాథ్ తన భార్యను మొదటిసారి చూసింది కూడా  ఓ దూరదర్శిన్ సంబంధించిన మూవీ షూటింగ్‌లోనే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *