ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఫేమ‌స్ కొరియోగ్రాఫర్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాథక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ప్రియురాలు నిధి మూనీసింగ్‌ను ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఫేమ‌స్ కొరియోగ్రాఫర్‌
Follow us

|

Updated on: Aug 27, 2020 | 1:28 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాథక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ప్రియురాలు నిధి మూనీసింగ్‌ను ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. బుధవారం నైట్ ఇరువురు ఎంగేజ్‌మెంట్ రింగ్స్‌ మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునీత్‌ తన సోష‌ల్ మీడియాలో‌ షేర్‌ చేశారు. వీటికి ‘జీవితానికి ఆరంభం’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ నూతన జంటకు పలువురు శుభాకాంక్ష‌లు తెలిపారు.

సింగర్‌ ఆదిత్య నారాయణ్‌, మౌని రాయ్‌, ఇషా గుప్తా, గౌహర్‌ ఖాన్‌, మో డిసౌజా, కొరియోగ్రాఫర్‌ టెరెన్స్‌ టూయిస్‌తో పాటు ఇతరులు సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా పునీత్‌ జంటకు అభినంద‌న‌లు తెలిపారు. కాగా రియాలిటీ షో డాన్స్‌ ఇండియా డాన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు పునీత్. ఈ షోలో రన్నరప్‌గా నిలిచి..త‌న స‌త్తా ఏంటో చూపించాడు. తర్వాత హలా లక్ దిఖా జా, డాన్సు ప్లస్, దిల్ హై హిందుస్తానీ, ఇండియా బనేగా మంచ్, డాన్స్‌ ఛాంపియన్స్‌ వంటి రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేశాడు. 2013లో రెమో డిసౌజా డైరెక్ట్ చేసిన‌ ఏబీసీడీ సినిమా ద్వారా పునీత్‌ బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించారు.

View this post on Instagram

To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #ENGAGED

A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on

Also Read :

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం