Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

‘డిజిటల్’ ఎఫెక్ట్‌: కోట్లు వస్తున్నా.. నిర్మాతలు హ్యాపీగా లేరా..!

Online Streaming Apps, ‘డిజిటల్’ ఎఫెక్ట్‌: కోట్లు వస్తున్నా.. నిర్మాతలు హ్యాపీగా లేరా..!

అడవి శేషు నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలను సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ‘ఎవరు’ చిత్రం ఆడుతోంది. అయితే సరిగ్గా నెల రోజులకు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమిచ్చింది. అయితే ఇదొక్క చిత్రం ఒక్కటే కాదు డిజిటల్ రంగం పెరుగుతున్న ఈ కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఆయా ఫ్లాట్‌ఫాంలో వస్తున్నాయి. ఇక నాని నటించిన ‘ఎమ్‌సీఏ’ చిత్రమైతే విడుదలైన 20రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌లో వచ్చేసింది. అలాగే రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’, మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ వంటి హిట్ చిత్రాలు కూడా ఇంకా థియేటర్లలో ఉండగానే ప్రైమ్‌లోకి వచ్చేశాయి.

కాగా ఒకప్పుడు ఏదైనా సినిమా విడుదలైన తరువాత రెండు మూడు నెలలకు గానీ ఒరిజినల్ ప్రింట్స్ వచ్చేవి కావు. ఇక కొత్త సినిమా ఏదైనా టీవీల్లో రావాలంటే చాలా సమయమే పట్టేది. అది సినిమా విడుదలై కనీసం సంవత్సరమైతే గానీ బుల్లితెరపై బొమ్మ పడేది కాదు. అదే బ్లాక్‌బస్టర్ చిత్రమైతే మరికొన్ని రోజుల సమయం పట్టేది. కానీ ఆ తరువాత శాటిలైట్స్ వచ్చిన తరువాత ఆ వ్యవధి కాస్త తగ్గుకుంటూ వస్తోంది. ఇక డిజిటల్ రైట్స్ పుణ్యమా అని నెల రోజుల వ్యవధిలో చాలా సినిమాల ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. దాంతో సినిమాలకు వెళ్లడం కూడా పూర్తిగా మానేస్తున్నారు ప్రేక్షకులు. ఎలాగైనా మరో నెలలో డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో వచ్చేస్తుంది కదా అంటూ కాస్త ఓపిక పడుతున్నారు.

అయితే దీనివల్ల నిర్మాతలకు చాలా లాభమే ఉంటుంది. డిజిటల్ రైట్స్ రూపంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు నిర్మాతలకు కోట్లు ఇస్తున్నారు. అయినా సినిమా ఇంకా థియేటర్లలో ఉన్నప్పుడు డిజిటల్‌లో వచ్చేస్తే అది కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని వారు ఫీల్ అవుతున్నారు. అసలే పైరసీ భూతంతో ఇప్పటికే సినిమా కలెక్షన్లు తగ్గుతుండగా.. ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్లపై పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.  ఫ్లాప్ అయిన సినిమాలకు ఈ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు కానీ.. హిట్ టాక్ వచ్చిన మూవీలకు మాత్రం డిజిటల్ రైట్స్ వల్ల ఇబ్బంది తప్పక ఉంటుంది. అలాగే లో బడ్జెట్ సినిమాల కలెక్షన్లపై డిజిటల్ రైట్స్ ప్రభావం పడుతోంది. ఇక ఈ విషయంపై టాలీవుడ్‌ నిర్మాతలు కూడా కొంతమంది బహిరంగంగానే ఫైర్ అయ్యారు. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు సైతం ఓ సందర్భంలో మాట్లాడుతూ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లపై మండిపడ్డారు. ఇప్పుడు టాలీవుడ్‌లో చిన్న సినిమాలు చాలా వస్తున్నాయని.. వాటిలో ఎక్కువ భాగం మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయని.. కానీ ఎలాగూ నెలలోపు డిజిటల్‌లో వస్తుంది కదా అని అలాంటి సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు అంత ఆసక్తిని చూపడం లేదని ఆయన అన్నారు. డిజిటల్ రైట్స్ వలన నిర్మాతలకు లాభాలు వచ్చినా.. ఇది ఇలానే కొనసాగితే థియేటర్లలో సినిమాలు చూడటంపై ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ తరువాత ఇదే అంశంపై తెలుగు సినిమా నిర్మాతల మండలి కూడా ఓ నిర్ణయం తీసుకుంది. విడుదలైన ప్రతి సినిమాను నెలలోపు డిజిటల్‌లో రిలీజ్ చేస్తామంటే కుదరదని.. కచ్చితంగా 8వారాలు రన్ ముగిసిన తరువాతే మూవీని విడుదల చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకొని ఐదు నెలలు పూర్తైనా.. ఇప్పటికీ కొత్త సినిమాలు నెలలోపే డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో వస్తున్నాయి. దీంతో నిర్మాతలు డీలా పడుతున్నట్లు టాక్.